NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు వెళ్లలేకపోతున్నారా..నిశ్చింతగా ఇళ్లలో ఉండి ఇలా చూసి తరించండి

Ayodhya Ram Mandir: దేశ వ్యాప్తంగా రామభక్తుల నిరీక్షణకు రేపటితో తెరపడతోంది. రేపు (22వ తేదీ) రామ మందిర్ ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక జరగబోతున్నది. అయితే ఈ కార్యక్రమాన్ని నేరుగా వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా అయోధ్యకు వెళుతున్నారు. అయితే అక్కడకు వెళ్లలేని భక్తులు సైతం తమ ఇళ్లలోనే ఉండి కుటుంబంతో కలిసి టీవీల్లో ప్రత్యక్షంగా లైవ్ లో చూడవచ్చు. ఈ లైవ్ ప్రసారాలు ఏయే ఛానెల్లో ఉంటాయి, ఏ సమయంలో చూడాలి అనే విషయాలను ఇక్కడ ఇస్తున్నాం.

అయోధ్యకు వెళ్లలేని భక్తుల సౌకర్యార్ధం ఆ కార్యక్రమాన్ని డీడీ న్యూస్, దూరదర్శన్ జాతీయ ఛానెల్ లో లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది. ఇది కాకుండా దాని ప్రత్యక్ష ప్రసారాన్ని డీడీ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ లో కూడా చూడవచ్చు. డీడీ న్యూస్ అయోధ్యలోని పలు ప్రాంతాల్లో 40 కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ లో చూపించబడుతుంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో పాటు సరయూ ఘాట్ సమీపంలోని రామ్ కి పైడి, కుబేర్ తిలా వద్ద ఉన్న జటాయు విగ్రహం, ఇతర ప్రదేశాల నుండి ప్రత్యక్ష పసార దృశ్యాలను చూపిస్తారు. ఈ వేడుకలను అత్యాధునిక 4 కే టెక్నాలజీలో ప్రసారం చేయినున్నారు.

ప్రత్యక్ష ప్రసార సమయం ఇది

రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుండి 12.30 నిమిషాల 32 సెకన్ల వరకూ జరగనుంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రతిష్టా క్రతువులను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఆలయం గురించి క్లుప్తంగా..

నాగార శైలిలో రామ మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయం మూడు అంతస్తులతో ఉంటుంది. ఆలయ సముదాయం మొత్తం 57 ఎకరాలు కాగా అందులో 10 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మించబడింది. ఆలయ పొడవు 360 అడుగులు, 235 అడుగుల వెడల్పు. ఎత్తు 161 అడుగులు. ఆలయంలో అయిదు మండపాలు, 318 స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం 14.6 అడుగులు. ఆలయ పనులు ప్రస్తుతం 55 శాతం పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ అంటే గర్భగుడి సిద్దంగా ఉంది. మొదటి అంతస్తులో దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తి అయ్యింది.

Sajjala Vs YS Sharmila: షర్మిలకు సజ్జల సూటి ప్రశ్నలు

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N