NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నేడు విశాఖకు సీఎం జగన్ .. పార్టీ క్యాడర్‌తో ‘సిద్దం’ తొలి సభ

YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సిద్దం’ పేరుతో పార్టీ క్యాడర్ తో వైసీపీ నేటి నుండి సమావేశాలు నిర్వహిస్తొంది. తొలి సమావేశం విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తొంది. ఈ సమావేశానికి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ హజరై 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

ys jagan

భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో ఏర్పాటు చేసిన భారీ ప్రాంగణంలో తొలి సభ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న సీఎం జగన్ ..అక్కడి నుండి హెలికాఫ్టర్ లో భీమిలి సంగీవలసలో జరిగే బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. ఈ సభలో రాబోయే ఎన్నికలపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా భారీ ఎత్తున క్యాడర్ తో సమావేశం నిర్వహిస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

YS Jagan

ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా ఎలా సమాధానం చెప్పాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించడం, పార్టీ మరింత బలోపేతం చేయడం కోసం క్యాడర్ ఏ విధంగా కృషి చేయాలని తదితర అంశాలపై జగన్ పలు సూచనలు చేయనున్నారు.

అలానే పార్టీ క్యాడర్ తో   మమేకమై తానున్నానంటూ వారికి భరోసా ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్ర తర్వాత రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాల్లో క్యాడర్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంతో పాటు విపక్షాలు అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించే దిశగా క్యాడర్ ను సిద్దం చేయనున్నారు. ఇదే క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా జగన్ క్యాడర్ కు వివరించి, పార్టీ అభ్యర్ధి విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించనున్నారు.

గెలుపే లక్ష్యంగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చి కొత్త వారికి ఇన్ చార్జి గా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు చేర్పులు జరగనున్నాయి. నియోజకవర్గంలో అభ్యర్ధి ఎవరైనా పార్టీని దృష్టిలో పెట్టుకుని క్యాడర్ పని చేయాలని సీఎం జగన్ సూచించనున్నారు. ఈ ఎన్నికల శంఖారావం పూరిస్తున్న ఈ సభలోనే కీలక హామీలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలతో పాటు మరల అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కొత్త పథకాలను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Kovvuru TDP: కొవ్వూరు టీడీపీలో చిచ్చురేపిన ఫ్లెక్సీల వ్యవహారం

Related posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju