NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ‘ గంటా ‘ కు సీటు లేకుండా చేస్తోంది ఎవ‌రు… ఆ ఇద్ద‌రి పంతం నెగ్గిందా…!

ఎందుకో తెలియదు గాని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే ఇటీవల చంద్రబాబు, లోకేష్ కు పెద్దగా నచ్చటం లేదు. గంటా తెలుగుదేశం పార్టీని వీడి పలు పార్టీలు మారి 2014లో తిరిగి టిడిపిలోకి వచ్చారు. అప్పుడు చంద్రబాబు ఆయనకు మంచి ప్రయారిటీ ఇచ్చారు. ఐదేళ్లపాటు మంత్రి పదవి అనుభవించారు.. ఎప్పుడు అయితే పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో అప్పటి నుంచి గంటా టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తూ వచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన అస్సలు పట్టించుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జగన్ సర్కారుపై అలుపెరగని పోరాటం చేశారు. ఆయనతోపాటు ఆయన తనయుడు విజయ్ ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. అరెస్టయ్యారు.. జైలుకు వెళ్లి వచ్చారు.. గంటా మాత్రం చాలా సైలెంట్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు అస్సలు పట్టించుకోలేదు. చివరకు చంద్రబాబు అరెస్టు అయినప్పుడు మాత్రమే నామ్‌కే వాస్తేగా స్పందించారు. ఇవన్నీ చంద్రబాబుతో పాటు లోకేష్ గమనిస్తూ వచ్చారు. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఈ ఎన్నికలలో భీమిలి లేదా చోడవరం, అనకాపల్లిలో ఎక్కడ ఒక చోట నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.

గంటా అంటేనే ప్రతి ఎన్నికకు నియోజకవర్గ మారుతూ వస్తూ ఉంటారు. అయితే ఈసారి గంటాను ఏకంగా విశాఖ జిల్లా నుంచి పొరుగు జిల్లాకు మార్చేయాలని టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కూడా స్వయంగా ప్రెస్మీట్లో చెప్పారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స‌ సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి గంటాను పోటీ చేయించాలన్నదే చంద్రబాబు, లోకేష్ ఆలోచనగా తెలుస్తోంది. విశాఖ రాజకీయాల నుంచి గంటాను తప్పించాలని లోకేష్, అయ్యన్నపాత్రుడు బలంగా డిసైడ్ అయ్యారని వారిద్దరూ తెరవ వెనక చేసిన వ్యూహం మేరకే గంటాను చీపురుపల్లి బరిలోకి దింపాలన్న ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ గంటా ముందు పెట్టిందని తెలుస్తోంది.

అయితే గంటా మాత్రం విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లికి వలస వెళ్లేందుకు అస్సలు ఒప్పుకోవటం లేదు. మ‌రీ ముఖ్యంగా లోకేష్ కు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గంటా వ్యవహార శైలి నచ్చలేదని అందుకే గంటాకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తనను చీపురుపల్లి వెళ్ళమని టిడిపి అధిష్టానం చెప్పడంతో గంటా సైతం లోలోన రగిలిపోతున్నారు. అందుకే ఆయన నేరుగా ప్రెస్ మీట్ పెట్టి తాను చీపురుప‌ల్లికి వెళ్లనని తేల్చి చెప్పారు. విచిత్రం ఏంటంటే తన పొలిటికల్ కెరీర్లో అయ్యన్న మొత్తం మూడుసార్లు ఓడిపోయారు. అసలు ఓటమి అంటే తెలియని గంటాని పక్కన పెట్టి అయ్యన్నకు ప్రాధాన్యత ఇస్తుండడంతోనే గంటా విషయంలో టిడిపి వైఖరి ఎలా ?ఉండబోతుందో చెప్పకనే చెప్పినట్లు అయింది.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?