Sri Leela: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీ లీల. ఎక్కడో ఇతర దేశాల్లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ని ఓ ఆట ఆడుకుంటుంది. అదేవిధంగా ఒక్క యాక్టింగే కాకుండా డాక్టర్ మరియు డాన్సర్ కూడా. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ధమాకా తో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
ఇక ధమాకా అనంతరం ఈమె కెరీర్ ని తిరిగి చూసుకో లేదని చెప్పొచ్చు. స్టార్ హీరోల డాన్స్ కి గట్టి పోటీ ఇస్తూ తన సత్తా నిరూపించుకుంది. అవకాశం వచ్చిన ప్రతి సినిమాకి ఓకే చెబుతూ కొన్నిసార్లు సక్సెస్ అయితే మరికొన్నిసార్లు డిజాస్టర్ అయ్యింది. ఇక శ్రీ లీల ప్రస్తుతానికి ఎక్కువ సినిమాలే చేసినప్పటికీ తన సత్తా చాటే పాత్రకి ఎదగలేదు. ఇటీవల గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం ఈమె తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ తాను ఆ స్థాయికి ఎదగడం చాలా గర్వంగా ఉందని వెల్లడించింది. ఇక ప్రస్తుతం తెలుగు భాషకే పరిమితం కాకుండా తమిళ్ భాషలో కూడా నటించేందుకు సిద్ధమైంది శ్రీలీల. తన యాక్టింగ్ ఒక్క టాలీవుడ్ కే పరిమితం కాకూడదని నిర్ణయించుకుంది.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తమిళ్లో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటి? దర్శకుడు ఎవరు అనే విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. ప్రస్తుతాని కి కన్నడ మరియు తెలుగు భాషల్లో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో తమిళ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఇటీవలే రష్మిక మరియు పూజ హెగ్డే వంటి వారు తమిళ్ భాషలో నటిస్తూ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కూడా శ్రీ లీలా సైతం రష్మిక మరియు పూజ హెగ్డే బాటలో నడవనుంది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీ లీలానే తెలిపింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!