NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!

నిన్న మొన్నటి వరకు వైసిపి లోనే ఉన్న సదరు ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గంలో అదే వైసీపీని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న వైసిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పలువురు కీలక నేతలను కలుపుకుని ఈరోజు హైదరాబాదులో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబానికి గతంలో తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ కారణాలతో తెలుగుదేశం పార్టీకి దూరమై కాంగ్రెస్లో చేరారు.

The YCP MLA who emptied the entire YCP there.
The YCP MLA who emptied the entire YCP there.

2019 ఎన్నికలలో మైలవరం నుంచి పోటీ చేసి అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయం సాధించారు. ఐదేళ్లుగా కృష్ణ ప్రసాద్ వైసీపీలో ఎంత మాత్రం ఇమ‌డలేకపోయారు. వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరు ఉన్నా పార్టీ అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మైలవరం నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. అనూహ్యంగా ఇప్పుడు కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరుతుండడంతో అక్కడ టిడిపి నుంచి బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీటు వస్తుందా ? రాదా అన్న సందిగ్ధత నెలకొంది.

ఈరోజు నందిగామ నియోజకవర్గంలోని తన స్వగ్రామం అయిన ఐతవరం నుంచి 100 కారులతో ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్లి అక్కడ చంద్రబాబు సమక్షంలో కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరుతున్నారు. కృష్ణ ప్రసాద్ తనతో పాటు మైలవరం నియోజకవర్గంలోని ప్రధాన వైసీపీ క్యాడర్ను అంతా ఖాళీ చేసి మరి సైకిల్ ఎక్కేస్తుండటం విశేషం. కృష్ణ ప్రసాద్ పార్టీకి దూరమవుతారన్న సంకేతాలు వచ్చిన వెంటనే వైసీపీ అధిష్టానం మైలవరం జడ్పిటిసిగా ఉన్న స‌ర్నాల‌ తిరుపతిరావు యాద‌వ్‌ను మైలవరం అసెంబ్లీ సమన్వయకర్తగా ఎంపిక చేసింది.

తిరుప‌తి రావు యాద‌వ్ అసెంబ్లీకి పోటీ చేసే అంత సత్తా ఉన్న నేత అయితే కాదు. కేవలం డమ్మీగా మాత్రమే జగన్ తిరుపతిరావును సమన్వయకర్తగా ఎంపిక చేశారని ఫైనల్ గా మైలవరం నుంచి వైసీపీ తరఫున మరో నేత పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎంపీ కేశినేని నాని లేదా ఆయన కుమార్తె కేశినేని శ్వేత‌ లేదా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జోగి రమేష్ పేర్లు వైసిపి రేసులో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మైలవరం నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉన్న దేవినేని ఉమా, బొమ్మ‌సాని సుబ్బారావు, ప్ర‌స్తుత‌ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వీళ్లంతా తెలుగుదేశంలో ఉండడంతో వైసిపి దిక్కుతోచని స్థితిలో ఉందన్నమాట వాస్తవం.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?