NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు గుర్రాల కోసం ఆయన అన్వేషిస్తున్నారు. పలుచోట్ల కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు.. కొంతమందిని ఇతర నియోజకవర్గాలకు మారుస్తున్నారు. ఇప్పటికే 9 జాబితాలను విడుదల చేశారు. ఇక రాజమండ్రి పార్లమెంటు సీటు నుంచి టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వివి వినాయక్ పేరు వినిపించినా ఆయన పోటీలో ఉండనని చెప్పారు. ఇక టాలీవుడ్ ప్రముఖ హాస్య‌ నటుడు ఆలీని ఈసారి ఎన్నికల బరిలోకి దింపుతున్నారని టాక్ నడుస్తోంది.

ఆలీని ముస్లింలు ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటు స్థానం బరిలోకి దింపవచ్చని వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఆలీకి జగన్ సీటు ఖరారు చేశారని.. ఒకటి రెండు రోజులలో దీనిపై ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి ఆలీని గుంటూరు తూర్పు లేదా రాయలసీమలో మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని అనుకున్నారు. తీవ్ర చర్చల అనంతరం కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు స్థానాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని జగన్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలీ నంద్యాల పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం.

గత ఎన్నికలకు ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత ఊరైన రాజమండ్రి నుంచి టికెట్ ఆశించారు. అది నెరవేరలేదు.. ఆలీకి గత ఎన్నికలలో పోటీ చేసే అవకాశం రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ చెప్పినట్టు ప్రచారం జరిగింది. చివరకు అలాంటి పదవులు కూడా రాలేదు. 2021 చివరలో ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఇష్టం లేకపోయినా ఆలీ ఆ పదవితో సర్దుకుపోయారు.

ఇటీవల వైసిపి నుంచి సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఆలీ ఆయిష్టంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ వచ్చే ఎన్నికలలో ఆలీని లోక్సభకు పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే నంద్యాల లేదా కర్నూలు సీట్లలో ఎక్కడ ఒకచోట నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఆలీ ముందు ఆప్షన్ పెట్టగా ఆలీ నంద్యాలను కోరుకున్నట్టు తెలుస్తోంది.

Related posts

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N