NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ వెరివెరీ స్ట్రాంగ్‌.. ఈ లెక్క‌లు చూస్తే బాబు – ప‌వ‌న్‌కు గెలుపు క‌లే…!

ఏపీలో అధికార వైసిపి గత ఎన్నికలలో 50%కు పైగా ఓట్ల‌తో పాటు ఏకంగా 151 సీట్లు సాధించి అప్రతిహత విజయంతో అధికారంలోకి వచ్చింది. అలాగే 25 పార్లమెంటు స్థానాలలో ఏకంగా 22 పార్లమెంటు సీట్లు గెలిచింది. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళుతుంది. అలాగే 25 కు 25 ఎంపీ సీట్లు విజయం సాధించి తీరుతామని గట్టిగా చెబుతోంది.. ఇంత ధీమా వ్యూహం ఏమిటి అన్నది చాలామందికి అంతు పట్టటం లేదు.

ఒకసారి 2019 ఎన్నికల నుంచి వైసీపీ విజయాలు.. ఓట్ల గణాంకాలు చూస్తే ఈ ఐదేళ్లలో మరింత బలపడింది అని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. 2019 ఎన్నికలలో దాదాపు 50% దాకా ఓటు షేర్ వైసిపికి వస్తే ఈ ఐదు సంవత్సరాలలో అది 5 నుంచి 10% పెరిగింది అని చెప్తున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో.. ఇతర ఉప ఎన్నికలలో తమ పార్టీకి 2019 సాధారణ ఎన్నికల కంటే మరింతగా ఓటింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. తమ పార్టీకి 60 శాతం ఓటు షేర్ ఎన్నికలలో వస్తుంది అని వైసిపి వాళ్ళు చెబుతున్నారు. అలాంటప్పుడు ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్న జరిగే పని కాదు అని అంటున్నారు.

ఏపీలో టీడీపీకి గతసారి 40% ఓటు షేర్ వచ్చింది. అలాగే జనసేనకు ఆరు శాతం చేరు వచ్చింది. ఈ రెండు పార్టీలు కలిస్తే 46% షేర్ ఉంటుంది. ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది అన్నది టిడిపి నాయకులు చెబుతున్న మాట.. అందుకే ఈసారి తమ కూటమికి 50% కు పైగా ఓటింగ్ ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. అయితే వైసిపి లెక్కలు మరోలా ఉన్నాయి. తమకు పాజిటివ్ వేవ్ ఉంది కాబట్టి మరో శాతం ఓటు పెరిగి మొత్తం 60 శాతం ఓట్లు తమకు వస్తాయని చెబుతున్నారు.

టిడిపికి గత ఎన్నికలలో 40% ఓట్లు వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి అది 34% లోపల ఉందని… ఈసారి కూటమి ఓటు షేర్ 40 శాతాన్ని మించి ఉండదు అని వైసిపి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. అంటే పడే ప్రతి 10 ఓట్ల‌లో ఆరు వైసీపీకి పడితే నాలుగు టీడీపీ కూట‌మికే పడతాయి అన్నది వైసిపి వాళ్ళు వేసుకుంటున్న లెక్కలు. మరి ఈ ఎన్నికలలో వైసిపి వాళ్ల‌ లెక్కలు నిజం అవుతాయా లేదా కూటమి లెక్కలు గెలుస్తాయా అన్నది చూడాలి.

Related posts

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N