NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

రాజ‌కీయాల్లో ఎంతో మంది నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా మ‌రెంతో మంది వ‌స్తుంటారు.. పోతుంటా రు కూడా. కానీ, మ‌న‌సుపెట్టి రాజ‌కీయాలు చేసేవారు.. తాను నిల‌బ‌డి, త‌న పార్టీని నిల‌బెట్టుకునే నాయ‌కు లు మాత్రం చాలా చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తుంటారు. ఇలాంటి వారిలో ప‌ల్నాడు జిల్లా గుర‌జాల నియోజ‌క వ‌ర్గం టీడీపీ నేత ఒక‌రు. పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటినీ స‌మానంగానే తీసుకున్నారు. అందుకే ఆయ‌న అన్న‌గారి కాలం నుంచి లోకేష్ హ‌యాం వ‌ర‌కు… అంద‌రికీ ఇష్ట‌మైన `త‌మ్ముడ‌`య్యారు.

ఆయ‌నే `గుర‌జాల బెబ్బులి`గా స్థానిక టీడీపీ కేడ‌ర్ పిలుచుకునే నేత య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు. ఈయ‌న అంద‌రికీ డిఫ‌రెంట్‌గా ఉంటారు. వ‌రుస విజ‌యాలు వ‌చ్చిన‌ప్పుడు పొంగిపోయింది లేదు. వ‌రుస ప‌రాజ‌యాలు ఎదురైన‌ప్పుడు కుంగిపో యింది కూడా లేదు. అంతేకాదు.. పార్టీలో నేను సీనియ‌ర్‌ను.. నాకు ప‌ద‌వులు కావాలి.. అని ప‌ట్టుబ‌ట్టింది లేదు. ఇచ్చినా కాదన‌కూడ‌దు. ఇవ్వ‌క పోయినా బ‌ల‌వంతం చేయ‌కూడ‌దు.. అనే త‌న స్వ‌యం ప్ర‌క‌టిత మంత్రాన్ని జ‌పిస్తూ.. పార్టీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు.

1994 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో య‌ర‌ప‌తినేని కొన‌సాగుతున్నారు. వాస్త‌వానికి ఇంత సుదీర్ఘ కాలం ఒక పార్టీలో ఒక నాయ‌కుడు ఉండ‌డం అంటే.. మాట‌లు కాదు. ఇప్పుడున్న రోజుల్లో ఏ పార్టీకైనా ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు త‌ప్ప‌.. నేత‌లు నిక‌రం కాదు. ఇప్పుడున్న‌ట్టు నాయ‌కులు రేపు ఉండ‌రు. అలాంటిది ఉమ్మ‌డి గుంటూరులో ఇద్ద‌రే ఇద్ద‌రు నాయ‌కులు పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి పార్టీనే అంటిపెట్టుకుని ఉండ‌డంతో పాటు ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ పోటీ చేస్తూ వ‌స్తున్నారు. వారిలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌ న‌రేంద్ర కుమార్ ఒక‌రైతే.. రెండో దిగ్గ‌జ నాయ‌కుడు య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు.

అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం.. అన‌వ‌స‌రంగా ర‌చ్చ చేసుకోక‌పోవ‌డం.. ప్ర‌తిదానికీ రోడ్డెక్క‌డం.. మీడియా ముందుకు రావ‌డం వంటివి య‌ర‌ప‌తినేని రాజ‌కీయ హిస్ట‌రీలో లేనేలేవు. చివ‌ర‌కు టికెట్ విష‌యంపైనా ఆయ‌న ఇదే స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌తో ఉంటారు. ఇవ్వాల‌ని కానీ, ఇస్తేనే త‌ప్ప పార్టీలో ఉంటాన‌ని ఆయ‌న మారాం చేసిన సంద‌ర్భం ఇంత సుదీర్ఘ చ‌రిత్ర‌లో ఏనాడూ లేదు. పార్టీ పట్ల విధేయ‌త‌, అధినాయ‌కుల ప‌ట్ల అపార‌మైన గౌర‌వం, ప్రేమ వంటివే ఆయ‌న‌ను ముందుకు న‌డిపిస్తున్నాయి.

అంతేకాదు.. కేడ‌ర్‌ను సొంత కుటుంబంలా చూసుకోవ‌డం య‌ర‌పతినేని మ‌రో ప్ర‌ధాన ల‌క్ష‌ణం. నేటి రాజ‌కీయాలు ఎలా ఉన్నాయో అంద‌రికీ తెలుసు. ఎవ‌రు ఎక్కువ డబ్బులిస్తే.. అటు వెళ్లిపోయే కేడ‌రే చాలా పార్టీల్లో క‌నిపిస్తోంది. కానీ, య‌ర‌ప‌తినేని ద‌గ్గ‌ర ద‌శాబ్దాలుగా ప‌నిచేస్తున్న, ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్న కేడ‌ర్ ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. దీనికి కార‌ణం.. ఆయ‌న చూపించే ప్రేమ‌, ఆప్యాయ‌త‌లే.

కేడ‌ర్‌కు ఏక‌ష్టం వ‌చ్చినా.. నేనున్నానంటూ ముందుంటారు. ఏ పండుగ వ‌చ్చినా.. త‌న ఇంట్లో ఎంత సంబ‌రంగా చేసుకుంటారో.. అదేవిధంగా కేడ‌ర్ కుటుంబాల్లోనూ జ‌రుపుకొనేలా సాయం చేస్తారు. అందుకే.. ఆయ‌న గుర‌జాల టీడీపీకి ఐకాన్‌నాయ‌కుడు అయ్యారు. ప్ర‌జ‌ల గుండెల్లోనూ పార్టీ నాయ‌కుల మ‌న‌సుల్లోనూ చిర‌స్థాయి గుర్తింపు పొందారు. అన్న‌గారి నుంచి లోకేష్ వ‌ర‌కు.. అంద‌రూ ప్రేమించే నాయ‌కుడు అయ్యారు.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?