NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కొలిక్కిరాని సీట్లు.. ఏపీలో ఎన్డీయే ఫీట్లు.. !

ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అభ్యర్థుల ఎంపికపైస్పష్టత రావాల్సి ఉంది. మూడు పార్టీలు కలిసి 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయి. వీటిలో కీల‌క‌మైన పాలకొండ, ఎచ్చెర్ల, చీపురుపల్లి, భీమిలి, పాడేరు, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ, కైకలూరు, దర్శి, ఆలూరు, ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్, ధర్మవరం, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, రైల్వే కోడూరు ఉన్నాయి. అయితే.. జిల్లాల వారీగా చూసుకుంటే మాత్రం గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని మొత్తం సీట్లకు మాత్ర‌మే అభ్యర్థులను ప్రకటించారు.

వీటిపై స్ప‌ష్ట‌త క‌రువు..
తొలి జాబితాలో ప్రకటించిన పి.గన్నవరం స్థానం పై సందిగ్దత నెలకొంది. ఈ స్థానాన్ని బీజేపీకి ఇస్తారని అంటున్నారు. తిరుపతి అభ్యర్థి మార్పుపై జనసేనలో తర్జన భర్జన జరుగుతోంది. కొన్ని స్థానాలకు మార్పులు చేసుకోవాలని బీజేపీ, జనసే నిర్ణయించు కున్నాయి. తిరుపతి, రాజంపేట, రైల్వే కోడూరు, ధర్మవరం, అనంత అర్బన్, విజయవాడ పశ్చిమ స్థానాల విషయంలో మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉంది. చీపురుపల్లి, భీమిలి, దర్శి, గుంతకల్లు, ఆలూరు స్థానాలను మాత్రమేటీడీపీ పెండింగ్ లో పెట్టింది. ఎచ్చెర్ల, పాడేరు, పి.గన్నవరం, విజయవాడ వెస్ట్, కైకలూరు, ఆదోని, అనంత అర్బన్, ధర్మవరం, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట స్థానాల్లో బీజేపీ జనసే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఇవి స‌మ‌స్యాత్మ‌కం..
ఏపీ పొత్తులో భాగంగా ఆరు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది బీజేపీ. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి లోక్‌సభ సీట్లలో ఆ పార్టీ యుద్ధానికి సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే శ్రీకాకుళం, పాడేరు, విశాఖ నార్త్, కాకినాడ సిటీ, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ఆదోని, ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్లల్లో బీజేపీ అభ్యర్థులు రంగంలోకి దిగుతారని చెప్పుకుంటున్నారు. అంత వరకు ఓకే అనుకున్నా… అక్కడ అభ్యర్థులు ఎవరన్నదే ఇప్పుడు అసలు సమస్యగా మారిందన్నవార్త‌లు వ‌స్తున్నాయి.

ఇచ్చి పుచ్చుకోండి
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పార్లమెంట్ స్థానాలు కాకుండా.. రాజంపేట, హిందూపురం వంటి సీట్లను బీజేపీ కోరుకుంటున్నట్టు సమాచారం. ఆ రెండు స్థానాలు తమ పార్టీకి దక్కితే.. ప్రచారంలో ఉన్న రెండిటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. అలాగే నరసాపురానికి బదులు ఏలూరు టిక్కెట్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్తపల్లి గీత, విజయనగరానికి మాధవ్ లేదా కాశీరాజు, అనకాపల్లికి సీఎం రమేష్, రాజమండ్రికి పురందేశ్వరి లేదా సోము వీర్రాజు, తిరుపతి అభ్యర్థిగా సత్యప్రభ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చి.. బీజేపీ కోరుకున్నట్టు రాజంపేట, హిందూపురం టిక్కెట్లు దక్కితే.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?