NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Venky: వెంకీ మూవీకి స్నేహా ఫ‌స్ట్ ఛాయిస్ కాదా.. 20 ఏళ్ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డ్డ ర‌హ‌స్యం!

Venky: మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ వెంకీ. ఈ సినిమాలో అందాల భామ స్నేహ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అశుతోష్ రాణా, తనికెళ్ళ భరణి, ఢిల్లీ రాజేశ్వరి, సి. వి. ఎల్. నరసింహా రావు, బ్రహ్మానందం, ఎ. వి. ఎస్, చిత్రం శ్రీను త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. లక్ష్మి ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై అట్లూరి పూర్ణచంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించారు.

2004 మార్చి 26న‌ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని అందుకుంది. ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అందులోనూ ట్రైన్ ఎపిసోడ్ ఇప్ప‌టికీ ఎవర్ గ్రీన్. ఈ ఎపిసోడ్ లో గజాలాగా బ్రహ్మానందం, బొక్కగా ఏవీఎస్ పండించిన కామెడి నెక్స్ట్ లెవ‌ల్ అనే చెప్పుకోవ‌చ్చు. సినిమా మొత్తానికే ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది.

అలాగే ర‌వితేజ-స్నేహా కెమిస్ట్రీ, శ్రీ‌నువైట్ల స్క్రీన్ ప్లే, దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం వెంకీ చిత్రాన్ని సూప‌ర్ హిట్ గా మ‌లిచాయి. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో ఈ సినిమాను 4K క్వాలిటీతో రీరిలీజ్ చేశారు. అయితే రీరిలీజ్ లోనూ వెంకీకి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. విడుద‌లైన ఇర‌వై ఏళ్ల‌కు ఈ సినిమాకు సంబంధించి ఓ ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డింది. అదేంటంటే.. వెంకీ మూవీలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ కు ఫ‌స్ట్ ఛాయిస్ స్నేహా కాద‌ట‌.

తాజాగా ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల స్వ‌యంగా వెల్ల‌డించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌ను వైట్ల.. వెంకీ సినిమా గురించి మాట్లాడాడు. మొద‌ట ఈ చిత్రంలో రవితేజ‌కు జోడీగా శ్రావ‌ణి పాత్ర కోసం ఆసిన్‌ను ఎంపిక చేశామ‌ని.. కానీ కొన్ని అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆమె వెంకీ నుంచి త‌ప్పుకుంద‌ని శ్రీను వైట్ల తెలిపారు. దాంతో ఆసిన్ స్థానంలో హోమ్లీ బ్యూటీ స్నేహాను తీసుకున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

శ్రావ‌ణి పాత్ర‌కు స్నేహ పూర్తి న్యాయం చేసిందని.. ర‌వితేజ‌, స్నేహ కాంబోలో వ‌చ్చే ప్ర‌తి సీన్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంద‌ని శ్రీ‌ను వైట్ల పేర్కొన్నారు. కాగా, శ్రీ‌ను వైట్ల కెరీర్ ప్ర‌స్తుతం అంతంత మాత్రంగానే ఉంది. ఆయ‌న హీట్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. ఆయ‌న గ‌త చిత్రాలు బ్రూస్ లీ, ఆగ‌డు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రిగా స‌త్తా చాటిన శ్రీ‌ను వైట్ల‌.. ఇప్పుడు ఫేడౌట్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. గ‌త ఏడాది మంచు విష్ణుతో శ్రీ‌ను వైట్ల‌ ఢీ మూవీకి సీక్వెల్ ను ప్ర‌క‌టించారు. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాక‌ముందే అట‌కెక్కింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తో శ్రీను వైట్ల ఓ మూవీ చేస్తున్నాడు. గోపీచంద్ కెరీర్ 32వ ప్రాజెక్ట్ ఇది. కొద్ది రోజుల క్రిత‌మే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో స్టార్ట్ అయింది. మ‌రి ఈ సినిమా అయినా శ్రీ‌ను వైట్ల కెరీర్ ను మ‌లుపు తిప్పుతుందో లేదో చూడాలి.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?