NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Nikita Thukral: కల్యాణ రాముడు హీరోయిన్ నికితా గుర్తుందా.. 50 సినిమాలు చేసిన న‌టి ఇప్పుడెలాంటి స్థితిలో ఉందో తెలుసా?

Nikita Thukral: నికితా తుక్రాల్.. ఒక‌ప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటిన ఈ బ్యూటీని ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినీ ప్రియుల‌కు కూడా నికితా సుప‌రిచిత‌మే. త‌క్కువ స‌మ‌యంలోనే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నికితా వెండితెర‌పై క‌నిపించి చాలా కాలమే అయిపోయింది. దాదాపు 50 సినిమాల్లో న‌టించిన నికితా ఇప్పుడెక్క‌డ ఉంది..? ఎలాంటి స్థితిలో ఉంది..? ఎందుకు ఇండ‌స్ట్రీకి దూర‌మైంది..?వంటి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నికితా తుక్రాల్.. హిందూ పంజాబీ కుటుంబంలో జ‌న్మించింది. ముంబైలో పెరిగింది. న‌గ‌రంలో కిషించంద్ చెల్లారం కాలేజీలో నికితా ఎకనామిక్స్‌లో ఎంఏ చేసింది. న‌టి కావాల‌ని ఆమె ఎప్పుడూ కోరుకోలేదు. సినిమా ఛాన్సుల కోసం ఆమె ప్ర‌య‌త్నించింది లేదు.జుహులోని ఒక హోటల్‌లో భోజనం చేస్తున్నప్పుడు టాలీవుడ్ దిగ్గ‌జ‌ నిర్మాత డి రామానాయుడు నికితాను చూశారు. హీరోయిన్ అయ్యే ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో రామానాయుడు నికితాకు తాను నిర్మించ‌బోయే హాయ్ చిత్రంలో అవ‌కాశం ఇచ్చారు.

ఈ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ గారు హాయ్ మూవీతో త‌న పెద్ద కుమారుడు ఆర్య‌న్ రాజేష్ ను ఇండ‌స్ట్రీలోకి లాంచ్ చేశారు. 2002లో ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. దాంతో నికితాకు వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. కైయేతుం దూరత్ మూవీతో మ‌ల‌యాళంలోకి, కురుంబు చిత్రంతో త‌మిళంలోకి నికితా ఎంట్రీ ఇచ్చింది. 2003లో వేణు తొట్టెంపూడితో క‌లిసి నికితా చేసిన కల్యాణ రాముడు మూవీ మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాతో నికితాకు టాలీవుడ్ లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ త‌ర్వాత సంబరం, కుషీ కుషీగా, అగంతకుడు, మహారాజ‌శ్రీ‌, డాన్‌, అనసూయ.. ఇలా అనేక చిత్రాల్లో నికితా యాక్ట్ చేసింది. త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లోనూ డ‌జ‌న్ల కొద్ది సినిమాలు చేసింది. త‌న అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చోటు ద‌క్కించుకుంది. హీరోయిన్ గా గ్రాఫ్ త‌గ్గిన త‌ర్వాత ప‌లు చిత్రాల్లో స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషించింది. 2013లో క‌న్న‌డ బిగ్ బాస్ సీజన్ 1లో నికితా కంటెస్టెంట్ పాల్గొంది. బిగ్ బాస్ హైస్ లో 99 రోజులు పూర్తి చేసుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. అయితే 2017 త‌ర్వాత నికితా వెండితెర‌కు పూర్తిగా దూర‌మైంది. అదే ఏడాది ఆమె ముంబైకు చెందిన గగన్‌ దీప్‌ సింగ్‌ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.

మ్యారేజ్ అనంత‌రం యాక్టింగ్ చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిందో లేక భర్త వద్దన్నాడో తెలియదు కానీ.. నికితా తుక్రాల్ సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసింది. భ‌ర్త‌తో ముంబైలో సెటిల్ అయింది. ఈ దంప‌తుల‌కు ఒక కూతురు కూడా జ‌న్మించింది. ఆమె పేరు జాస్మీరా. భ‌ర్త మ‌రియు కూతురు బాగోగులు చూసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇకపోతే వెండితెర‌కు దూర‌మైనా కూడా నికితా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యామిలీ ఫోటోల‌ను పంచుకుంటూ త‌న అభిమానులు అల‌రిస్తూ ఉంటుంది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?