NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BCYP: బీసీ యువజన పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదల ..పవన్ పై పిఠాపురంలో అభ్యర్ధిగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహద్రి

BCYP: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ 114 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఎం కూడా కాంగ్రెస్ తో పొత్తు, సీట్ల సర్దుబాటు చేసుకుని అభ్యర్ధులను ప్రకటించాయి. తాజాగా ఈ ఎన్నికల్లో పలు కొత్త పార్టీలు పోటీకి సిద్దమవుతున్నాయి. అభ్యర్ధులను ప్రకటిస్తాయి.

న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని జై భీమ్ పార్టీ, విశ్రాంతి ఐపీఎస్ (సీబీఐ మాజీ జేడీ) వీవీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ నేషనల్ పార్టీ లతో పాటు పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త బొడె రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ లు తొలి సారిగా ఏపీ ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇవేళ 32 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేశారు.

పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తన సొంత నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గంతో పాటు రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నుండి కూడా బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుండి ట్రాన్స్ జెండర్, బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహద్రిని అభ్యర్ధిగా బీసీ యువజన పార్టీ ప్రకటించింది. జనసేన పార్టీలో టిక్కెట్ కోసం ధరఖాస్తు చేసిన తమన్నా సింహద్రి .. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానం నుండే బీసీ యువజన పార్టీ తరుపున పోటీ చేస్తుండటం విశేషం.

రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ కూడా ట్రాన్స్ జెండర్ లకు అవకాశం కల్పించలేదు. తొలి సారిగా బీసీ యువజన పార్టీ అవకాశం కల్పించింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుండి బిగ్ బాస్ ఫేమ్, ట్రాన్స్ జెండర్ తమన్నా సింహద్రి    పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులు

  • ఇచ్చాపురం – బడ్డి మురళి
  • శ్రీకాకుళం – పనిల ప్రసాద్
  • ఆముదాలవలస – సెపిన శ్రీనివాసరావు
  • అరకు వ్యాలీ (ఎస్టీ) – దుర్లయ సాయిబాబ
  • పాడేరు – కైలో రంగారావు
  • ప్రత్తిపాడు  – కుందల సాయి కుమార్
  • పిఠాపురం – తమ్మన్నా సింహద్రి
  • రామచంద్రాపురం – బార్ల వెంకట శ్రీనివాసరావు
  • రాజమండ్రి రూరల్ –దుగ్గిరాల శ్రీదేవి
  • నరసాపురం – ఆకుల వెంకట స్వామి
  • మైలవరం – ముప్పసాని భూలక్ష్మి
  • పెదకూరపాడు – ఆళ్ల రామకృష్ణారావు (ఆర్కే యాదవ్)
  • మంగళగిరి – బొడె రామచంద్ర యాదవ్
  • రేపల్లె – అంకిరేకుల ఆదినారాయణ
  • తెనాలి – తుమపాల నరేంద్ర
  • ప్రత్తిపాడు (ఎస్సీ) – ఎస్ఎస్ రాణి (మహాలక్ష్మి)
  • నరసరావుపేట – గోగుల మనోహర్ యాదవ్
  • మార్కాపురం – భాగ్యలక్ష్మి రావిళ్ల
  • నెల్లూరు సిటీ – కాళహస్తి చెంచు మహేష్
  • కొవ్వూర్(ఎస్సీ) – పుటిక సుబ్బరాయుడు
  • పులివెందుల – సురే నిర్మల
  • నంద్యాల – చింతపల్లె సుధాకర్ రావు
  • ఢోన్ – తరిగోపుల బాల సుబ్బయ్య (బాలు యాదవ్)
  • పత్తికొండ – మిద్దె వెంకటేశ్వర్లు
  • అలూర్ – ఎన్ మోహన్ ప్రసాద్
  •  గుంతకల్ – ముచల శశిభూషన్ రెడ్డి
  • పుట్టపర్తి – బాల రామాంజనేయులు
  • పుంగనూరు – బొడె రామచంద్ర యాదవ్
  • తిరుపతి – ఎ కృష్ణవేణి యాదవ్
  • శ్రీకాళహస్తి – కే ధినాద్ బాబు
  • పూతలపట్టు (ఎస్సీ) – నాంపల్లి భానుప్రసాద్
  • రాప్తాడు – గంగాటి మంజునాథ్ రెడ్డి

Janasena: నేను సైతం జనసేనకు అంటూ భారీ విరాళాన్ని అందించిన చిరంజీవి

Related posts

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N