NewsOrbit
న్యూస్

మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం

అమరావతి: ఏలూరుకు చెందిన టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన బుజ్జిని కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. బుజ్జి దివంగత ప్రముఖ సినీ నటుడు ఎస్‌వి రంగారావుకు స్వయాన మేనల్లుడు.

గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన బుజ్జి 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టిడిపి తరుపున 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

బుజ్జి మృతి పట్ల  అధినేత చంద్రబాబు, నేతలు సంతాపాన్ని తెలియజేశారు. బుజ్జి కుటుంబ సభ్యులను చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, పలువురు టిడిపి నేతలు బుజ్జి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించేందుకు బయలుదేరి వెళ్లారు.

Related posts

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Leave a Comment