NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రేవంత్ ఇప్పట్లో రాగలరా..?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

హైదరాబాద్: కెసిఆర్ సర్కార్‌పై ఒంటికాలితో లేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న డాషింగ్ లీడర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్జి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. డ్రోన్ కెమెరా చిత్రీకరణ కేసులో బెయిల్‌పై విడుదలైన వెంటనే మళ్లీ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది.      

ఇప్పటికే టిడిపిలో ఉండగా ఒక సారి ఓటు నోటు కేసులో అరెస్టు అయి చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డిని ఇటీవల కెసిఆర్ ఫామ్ హౌస్ వద్ద అనుమతులు లేకుండా డ్రోన్ ‌కెమెరాలు వినియోగించారన్న కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదిలా ఉండగానే  మరో పక్క ఆయన, ఆయన సోదరుడిపై గోపన్‌పల్లి భూ కుంభకోణం ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి రేవంత్ బ్రదర్స్ వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఆర్‌డిఒ చంద్రకళ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. ప్రభుత్వ, ప్రైవేటు, చెరువు భూములను సైతం వీరు ఆక్రమించారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారంటే  ఈ నెల రెండవ తేదీన గండిపేటకు వెళ్లే దారిలో మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌ నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ ముట్టడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యలో జన్వాడ వద్ద రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అయితే ఆ సమయంలో అక్కడ డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ చేశారు. ఈ సందర్భంలో సిఎం కేసిఆర్, మంత్రి కెటిఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కెటిఆర్ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. 111 జివోను అతిక్రమించి అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని పేర్కొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌కు రాగా కెటిఆర్ లీజ్‌కు తీసుకున్న ఫామ్ హౌస్ మీద అనుమతి లేకుండా  రేవంత్ రెడ్డి అనుచరులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారన్న ఫిర్యాదుపై అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపారు.

అయితే రేవంత్ రెడ్డి రెడ్డి అరెస్టును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియాతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఖండించారు. కెసిఆర్ అరాచకపాలనకు రేవంత్ రెడ్డి అరెస్టు నిదర్శనమని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కుంతియా డిమాండ్ చేశారు. కెటిఆర్ తన ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారా లేదా అనే విషయాన్ని ప్రకటించి తన నిజాయితీ నిరూపించుకోవాలని కుంతియా కోరారు. తెలంగాణలో దుర్మార్గమైన పాలన నడుస్తోందనీ, ప్రశ్నిస్తే అరెస్టు చేయడమేమిటని టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కలు ప్రశ్నిస్తూ రేవంత్‌కు బాసటగా నిలిచారు. ఈ కేసు నుండి బయటకు రాకముందే ఆయనకు గోపన్‌పల్లి భూ దందా కేసు వెంటాడుతోంది. గోపన్‌పల్లి భూదందా వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఇంత వరకూ నోరు మెదపలేదు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే కోర్టును ఎందుకు ఆశ్రయించారంటూ ప్రశ్నించింది. చట్టప్రకారం నడుచుకోవాలని రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశించింది.

రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల మాట్లాడుతూ పోలీసులు చట్టప్రకారమే చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. 111 జివోను ఉల్లంఘించి నిర్మాణాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని వెల్లడిస్తూ దానిపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సవాల్ విసిరారు.

డ్రోన్ కెమెరా చిత్రీకరణ కేసులో బెయిల్‌పై విడుదల కాగానే గోపన్‌పల్లి భూదందా కేసులోనూ రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.    

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Leave a Comment