NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ – జనసేన మైత్రి బద్ధలుకొట్టబోతున్న జగన్ ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయడానికి మొదటి లో తెలుగుదేశం పార్టీ తో పాటు జనసేన కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడా కూడా వైఎస్ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ఇంగ్లీష్ మీడియం మరియు ఇసుక అని ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలని రెండు పార్టీలు భావించిన ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా తెలుగు దేశం పార్టీ కంటే ఎక్కువగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సీఎం జగన్ ని అనేక రకాలుగా ఇంగ్లీష్ మీడియం మరియు ఇసుక విషయంలో విమర్శలు చేయడం మనం చూశాం.

Read: Will BJP-JanaSena alliance affect the prospectus of YSRCP ...

అయినా గానీ పెద్దగా ప్రజల నుంచి స్పందన లేదు. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇటీవల ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా బిజెపి జనసేన పార్టీలు కొంచెం దూకుడుగా వ్యవహరిస్తున్న వాతావరణం నెలకొంటున్న తరుణంలో రెండు పార్టీల మైత్రిని జగన్ బద్దలు కొట్టడానికి జగన్ సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ఇటీవల ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సమయంలో ‘మన పాలన మీ సూచన’ అనే కార్యక్రమం నిర్వహించడం అందరం చూసినాము. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో జగన్ ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక హోదా టాపిక్ లేవనెత్తడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో పరిణామాలన్నీ మారిపోయాయి. ప్రతిపక్షంలో ఉన్న టైంలో జగన్ ఎక్కువగా ప్రత్యేక హోదా నే ఆయుధంగా చేసుకొని రాజకీయాలు చేయటం జరిగింది. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తేస్తానని మాట ఇవ్వడం కూడా చూశాం. కానీ అధికారంలోకి వచ్చాక… కేంద్రంలో ఉన్న పార్టీకి మెజార్టీ ఎక్కువ ఉంది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ తీసుకు రావడం కష్టమే అన్నట్టుగా జగన్ చేతులెత్తేసినట్లు మాట్లాడటం జరిగింది.

Three capitals: Jana Sena and BJP begins Bharosa Yatra in capital ...

అయితే జగన్ ఒక్కసారిగా ఇటీవల ‘స్పెషల్ స్టేటస్’ టాపిక్ తెరపైకి తీసుకు రావడానికి కారణం బీజేపీ జనసేన మైత్రీబంధం ని బద్దలు కొట్టడమే టార్గెట్ గా మాట్లాడటం జరిగిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తి విషయంలోకి వెళితే విభజనతో నష్టపోయి కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్న సమయంలో రాష్ట్ర బిజెపి నాయకులు జనసేన పార్టీ నేతలు అత్యుత్సాహంగా ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పట్ల జగన్ ఇటీవల అసహనం చెందినట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా రాష్ట్ర బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని ప్రభుత్వం పై విమర్శలు చేస్తే ఏం వస్తుంది అని జగన్ పార్టీ సీనియర్లతో అన్నారట.

Pawan kalyan jagan and Chandrababu naidu In Guntur District

ఈ విషయంలో బీజేపీకి చెక్ పెట్టాలంటే ‘ప్రత్యేక హోదా’ అంశం లేవనెత్తితే  చాలు ఏం మాట్లాడ లేని పరిస్థితిలో వెళ్తారని అదేవిధంగా జనసేన పార్టీకి కూడా షాక్ ఇచ్చినట్లు అవుతుందని జగన్ ఇటీవల ‘ప్రత్యేక హోదా’ అనే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్. ఒకవేళ భవిష్యత్ లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ‘ప్రత్యేక హోదా’ నే ఆయుధంగా చేసుకుని ప్రజా వ్యతిరేకత తీసుకురావాలన్ని భావించినా ఆ ఛాన్స్ ఉండకుండా ముందే జగన్ మళ్లీ అదే నినాదాన్ని అందుకున్నారని కొంతమంది అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని జనసేన లేదా టీడీపీ ప్రశ్నించిన గాని బీజేపీ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదని జగన్ చెప్పుకునే అవకాశం ఉంది. అదే సమయం లో జనసేన మరియు బిజెపి మైత్రీబంధం కూడా దెబ్బతినే విధంగా జగన్  స్ట్రాటజీ వేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ స్పెషల్ స్టేటస్ నినాదం తో జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకువస్తే, ప్రజెంట్ తాను అధికారంలోకి వచ్చి ఆ నినాదం తోనే సెల్ఫ్ డిఫెండ్ చేసుకుంటున్నట్లు అంతా భావిస్తున్నారు.  

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N