NewsOrbit
న్యూస్

మరో టీడీపీ నేత అరెస్ట్ :అచ్చన్న జైలుకే

అమరావతి : తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. శాసనసభ టీడీపీ ఉప నేత మాజీమంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగి 24 గంటలు గడవక ముందే అనంతపురం జిల్లాకు చెందిన మరో కీలక నేత సోదరుడు మాజీ ఎమ్మెల్యే జెసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్దిల అరెస్ట్ లు జరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని వారి నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్దితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతపురంకు తరలించారు.

154 బస్సులు నకిలీ ఎన్ఒసీ, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. బీఎస్ 3 వాహనాల విషయంలో కూడా వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో వారిపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి.

కొద్ది రోజుల క్రితమే దివాకర్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్‌రెడ్డిపై వారు ఆరోపణలు చేశారు.

టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి 24 గంటలు గడవక ముందే అదే పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్దిని ఆయన కుమారుడుని అనంతపురం పోలీస్ లు అరెస్ట్ చేయడం విశేషం. టీడీపీ అధికారంలో ఉండగా జెసీ ప్రభాకర్ రెడ్ది…వైఎస్ జగన్, వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం ప్రజలకు తెలిసిందే. ఈ అరెస్ట్ లపై టీడీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని ఆరోపిస్తుండగా టీడీపీ హయాంలో వారు చేసిన తప్పులకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దీనిలో కక్ష సాధింపు అనే మాటలకు అర్ధం లేదని వైసీపీ నేతలు, మంత్రులు పేర్కొంటున్నారు. ఈ అరెస్ట్ ల పరంపరలో నెక్ట్ ఎవరి వంతు వస్తుందోనని రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా ఉంది.

అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి శుక్రవారం రాత్రి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అయితే అనారోగ్య పరిస్థితి కారణంగా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో అచ్చెన్నాయుడును తొలుత విజయవాడ సబ్‌ జైలుకు.. అనంతరం జైలు అధికారులు అనుమతితో జీజీహెచ్‌కు తరలించారు. కాగా ఇదే కేసులో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ రమేశ్‌కుమార్‌కు‌ కూడా రెండు వారాల రిమాండ్‌ విధిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju