NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravati Farmers Protest: అమరావతి ప్రాంతంలో పోలీసు ఆంక్షలు..! ఆందోళనలకు అనుమతి నిరాకరణ..!!

Amaravati Farmers Protest: అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో హైకోర్టు నుండి మంగళగిరి లక్ష్మీనర్శింహస్వామి ఆలయం వరకూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఉద్యమకారులు చేపట్టిన ఈ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.

Amaravati Farmers Protest.. police forces in capital area
Amaravati Farmers Protest police forces in capital area

 

అమరావతి ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియా ప్రతినిధులను అనుమతించకుండా పెదపరిమి వద్దే నిలుపుదల చేశారు. మరో వైపు విజయవాడ – అమరావతి మార్గంలోనూ అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై నాలుగు ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి వదులుతున్నారు. మంగళగిరి లక్ష్మీనర్శింహస్వామి ఆలయం వద్ద కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు ర్యాలీగా వస్తారన్న సమాచారంతో ఆలయం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో  భూములు ఇచ్చిన రైతాంగం నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం హైకోర్టు విచారణలో ఉంది. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆ మేరకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju