అమెరికా (డల్లాస్) లో ఓ తెలుగు వ్యక్తి అరెస్టు అయ్యారు. ఆ వ్యక్తి ఏ కేసులో అరెస్టు అయ్యారు అనేది తెలుసుకుని అసహ్యించుకుంటున్నారు. డల్లాస్, ప్లానో ప్రాంతంలో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ నిర్వహకులు పోలీసుల కళ్లు గప్పేందుకు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. స్వల్పకాలిక అద్దెలపై గృహాలను తీసుకుని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. నార్త్ వెస్ట్ డల్లాస్ లోని ఓ వ్యక్తి నుండి జూలైలో వచ్చిన సమాచారంతో పోలీసులు స్వల్పకాలిక అద్దెలపై దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబర్ నెలలో స్వల్పకాలిక అద్దెతో వ్యభిచార గృహంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.
నాలుగు నెలల తర్వాత తాజాగా గురువారం డల్లాస్ పోలీసులు సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై 23 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు డల్లాస్ మరయు ప్లానోలో రెండు వెబ్ సైట్ ల ద్వారా సెక్స్ ట్రాఫికింగ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడి చట్టాల ప్రకారం వ్యభిచార నేరం కింద నిందితులకు ఆరు నెలల నుండి రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. పట్టుబడిన 23 మంది నిందితుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రామ్ యార్లగడ్డ అనే వ్యక్తి ఉన్నారు. ఈ నేరంలో ఆయన పాత్ర ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. వ్యభిచారం, దుష్ప్రవర్తన కేసుల్లో తెలుగు వారు అరెస్టు కావడం పట్ల అక్కడి తెలుగు కమ్యూనిటీలోని సీనియర్ సిటిజన్లు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా డెల్లాస్ లో ఎన్ఆర్ఐ ప్రముఖుడు కేసి చేకూరి అరెస్టు అయ్యారు. డల్లాస్ లో తెలుగు ఎన్ ఆర్ ఐ అసోసియేషన్ ప్రతినిధులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిర్వహించిన వేడుకల్లో కేసి చూకూరి కొందరిపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నందమూరి బాలకృష్ణ, మెగా బ్రదర్స్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈవెంట్ మేనేజర్లపై కేసీ చేకూరి మద్యం మత్తులో గొడవకు దిగి చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది.