AP Governor: ఏపి గవర్నర్ కు మరో సారి అస్వస్థత..! హుటాహుటిన ప్రత్యేక విమానంలో..

Share

AP Governor: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. ఈ నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కావడంతో 17వ తేదీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 20, 22 తేదీల్లో పరీక్ష నిర్వహించగా కోవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 23వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో విజయవాడ లోని రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి మరల ఆయన అస్వస్థతకు గురి కావడంతో ప్రత్యేక విమానంలో మరో సారి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారం రోజుల్లోనే మళ్లీ అస్వస్థతకు గురైయ్యారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. గవర్నర్ తో పాటు ఆయన సతీమణి కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగానే ఆసుపత్రికి వెళ్లినట్లు రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

AP Governor biswabhusan harichandan ill due to post covid problems
AP Governor biswabhusan harichandan ill due to post covid problems

 

ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ (88) జూలై 2019 నుండి ఏపి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. 1971లో జనసంఘ్ లో చేరిన బిశ్వభూషణ్ ..అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుండి 09 మద్య ఒడిశా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బిశ్వభూషణ్ రాజకీయ నేతగానే కాకుండానే న్యాయవాదిగా, రచయితగా గుర్తింపు పొందారు.

Read More: Junior NTR: చంద్రబాబుకు భారీ షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ అభిమానులు…! బాబు ఇలాకాలో తారక్ ఫ్యాన్స్ హంగామా..!!


Share

Related posts

RRR సినిమా అప్ డేట్ లేక డల్ గా ఉన్న జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సంబరపడిపోయే న్యూస్

Varun G

బండి సంజ‌య్ నిన్ను ఉరికిచ్చి కొడుత‌రు… నువ్వొక ఊస‌ర‌వెల్లిని

sridhar

ఒంగోలుకు శిద్దా, దర్శికి ఉగ్రనర్శింహ

somaraju sharma