రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో ప్రజలు ప్రతి చిన్న పనులకు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకుని అవసరమైన సిబ్బందిని నియమించారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలలో సిబ్బంది నియామకాలు జరిగాయి. సిబ్బంది నియామకం జరిగి మూడున్నరేళ్ల దాటిపోయింది. వీరి నియామకం తర్వాత రెండేళ్లకు రెగ్యులర్ చేసి పే స్కేల్ ఇవ్వాల్సి ఉండగా, డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి మూడేళ్లు అయిన వారిని రెగ్యులర్ చేశారు.

అయితే వీరు విధుల్లో చేరిన నాటి నుండి బదిలీలు లేకుండా ఒకే ప్రాంతంలో పని చేస్తున్నారు. అయితే వీరు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నది. ఇప్పటికే ప్రొబేషన్ పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఏపి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
సాధారణ బదిలీల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా ఉద్యోగుల డీఏ బకాయిలపై ఈ నెలలోనే జీవో జారీ చేయనున్నట్లు సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ కు విన్నవించగా, సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనం .. జవాన్ల వ్యాన్‌పై గ్రనైట్ దాడి.. ఆ తర్వాత కాల్పులు
Supreme Court: నుపూర్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన జడ్జీలపై అభిశంస తీర్మానం పెట్టాలంటూ న్యాయవాదుల ఆందోళన