ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు నేటి నుండి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఎవై) పథకంలో భాగంగా జనవరి 2023 నుండి డిసెంబర్ 2023 వరకూ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపిలో ఇప్పటి వరకూ రెగ్యులర్ పీడీఎస్ బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీలను ఎండియూ ఆపరేటర్ ( డోర్ డెలివరీ వ్యాన్) ల ద్వారా పంపిణీ జరుగుతుండగా, ప్రధాన మంత్రి ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు.

ప్రధాన మంత్రి (పీఎంజీకేఏవై) బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే మూడు నాలుగు నెలల నుండి ఉచితంగా పంపిణీ జరిగింది. అయితే 2023 జనవరి 1 వ తేదీ నుండి మొత్తం రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎండీయు వాహనాల ద్వారా బియ్యం కార్డులో ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నారు. పంచదార, కందిపప్పులకు మాత్రమే డబ్బులు వసూలు చేయనున్నారు. ఒక వేళ ఎండీయు ఆపరేటర్ లు బియ్యంకి డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రెగ్యులర్ పీడీఎస్ బియ్యం పంపిణీని నిలుపుదల చేసి పీఎంజీకేఏవై ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార (డబ్బులకు) ను రేషన్ కార్డుదారులకు ఎండియు (డోర్ డెలివరీ వ్యాన్) ఆపరేటర్ ల ద్వారా పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 1,45,43,997 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో 90,27,636 ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉన్నాయి. గత నాలుగైదు నెలల నుండి ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేశారు. పీఎంజీకేఏవై స్కీమ్, రెగ్యులర్ పీడీఎస్ కోటా లను కలిపి ఒకే పథకం గా మార్పు చేయడం ద్వారా నేడి నుండి మొత్తం కార్డుదారులకు ఎండీయు ఆపరేటర్ ల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు.
Munugode Bypoll: మునుగోడు ప్రజలకు హస్యాన్ని పండిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఆర్ఒకు నా శాపం తగిలిందంటూ వ్యాఖ్యలు