ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP News: ఏపిలో కొత్తగా ఏర్పాటవుతున్న రెవెన్యూ డివిజన్ లు ఇవే..

Share

AP News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీరణ నేపథ్యంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 50 రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల్లో మరో 13 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల్లో ఎప్పటి నుండో రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గతం నుండి ప్రతిపాదనల్లో ఉన్న వాటికి మోక్షం లభించింది.

AP News: new revenue divisions
AP News: new revenue divisions

AP News: కొత్త రెవెన్యూ డివిజన్ లు ఇవే..

అన్నమయ్య జిల్లాలో రాయచోటి, బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో కొత్తగా పలమనేరు రెవెన్యూ డివిజన్, విశాఖ జిల్లాలో భీమునిపట్నం రెవెన్యూ డివిజన్, విజయనగరం జిల్లాలో కొత్తగా బొబ్బిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా (కృష్ణా)లో నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పొదిలి రెవెన్యూ డివిజన్, శ్రీ సత్యసాయి బాబా జిల్లాలో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా భీమవరం రెవెన్యూ డివిజన్, నంద్యాల జిల్లాలో డోన్, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లు విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ డివిజన్ల సంఖ్య 63కి పెరిగింది.

Read More: AP New Districts: ఏపిలో గెజిట్ ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాలు ఇవే..

 


Share

Related posts

Viral Video : ఈ వైరల్ వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వడం ఖాయం..!! ఐడియా అదిరింది గురూ..!!

bharani jella

Big Boss: భారీ హంగులతో ముస్తాబవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్…!!

sekhar

Big Boss 5: హౌస్ లో కెమెరాల స్పెషాలిటీ చెప్పిన నాగార్జున..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar