NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP YSRCP: ఏపీలో మరో సారి జగన్‌దే అధికారం..! ఇదీ లెక్క..!!

YS Jagan: Planning Blasting Changes in Party, Government

AP YSRCP: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై, జగన్మోహనరెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందనీ, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పరాజయం పాలవ్వడం ఖాయమంటూ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

పలు సర్వేలు కూడా వైసీపీ ప్రభుత్వంపై వివిధ వర్గాలు గుర్రుగా ఉన్నారంటూ కూడా వెల్లడించాయంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే సీఎం వైఎస్  జగన్మోహనరెడ్డి మరో సారి సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు ఢంక భజాయించి చెబుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.

AP YSRCP will be in power in the coming elections
AP YSRCP will be in power in the coming elections

AP YSRCP: వైసీపీకి అండగా ఆ అయిదు జిల్లాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి జగన్మోహనరెడ్డికి కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు  అండగా నిలుస్తున్నాయి. 2012 ఉప ఎన్నికల్లోనూ ఆ తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఎన్నికల్లో ఆ జిల్లా ప్రజలు వైఆర్సీపీని ఆదరిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఈ సారి రకపోవచ్చనే మాట వినబడుతోంది. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపిలో మ్యాజిక్ ఫిగర్ 88, 88 సీట్లు సాధించిన ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. గత 2014 ఎన్నకిల్లో వైసీపీ 67 సీట్లు కైవశం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు 21 సీట్లు దూరమయ్యి అధికారానికి దూరం అయ్యింది. ఆ తరువాత రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేసి జనాల మనసులను గెలుచుకున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో అందరి అంచనాలకు భిన్నంగా 151 సీట్లు వైసీపీ గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.

సీట్లు తగ్గినా అధికారం ఖాయమేనట

అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నా వైసీపీ శ్రేణులు మాత్రం ఎలాగైనా మరో సారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేందుకు కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో దోహదపడతాయని అంటున్నారు. ఎందుకంటే ఈ జిల్లాల్లో వైసీపీకి ఆదరణ ఎక్కువే. గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈ సారి 2024 ఎన్నికల్లోనూ ఈ జిల్లాల్లో వైసీపి అత్యధిక స్థానాలు కైవశం చేసుకునే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నారు. ఈ అయిదు జిల్లాల్లో కలిపి మొత్తంగా 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 50 స్థానాలు వైసీపీ గెలుచుకున్నా మిగలిన జిల్లాల్లో ఉన్న 115 స్థానాల్లో 38 స్థానాలు వైసీపీ గెలుచుకుంటే జగన్ అధికారానికి ఢోకాలేదని చెబుతున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N