Pawan kalyan: కాల్ష్‌షీట్స్ కోసం బ్లాంక్ చెక్‌లు ప‌ట్టుకుని క్యూలో నిలుచున్నా పవన్ కళ్యాణ్ వాళ్ళని లెక్కచేయడా..?

Share

Pawan kalyan: ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినీరంగంలో ప్ర‌వేశించి 30 ఏళ్లు ద‌గ్గ‌ర కావ‌స్తోంది. ఈ 30 ఏళ్ల‌లోపు 30 సినిమాలు కూడా పూర్తి చేయ‌లేదంటే..ఎంత సెలెక్టివ్‌..ఇంకెంత ప్ర‌త్యేక‌మైన సినిమాలు ఎంచుకున్నారో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఎలాంటి అండదండలు లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. ఆయన రెండవ త‌మ్ముడు నాగ‌బాబు అన్న‌బాట‌లో ..నటుడిగా, నిర్మాతగా సినిమాల‌తో ఫేమ‌స్ అయ్యారు. ఇంటి నిండా సినీ వాతావ‌ర‌ణం ఉన్నా…అప్ప‌టి వ‌ర‌కూ దూరంగా ఉన్న‌ కొణిదెల క‌ళ్యాణ్‌బాబు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గా వెండితెర‌పై త‌న అదృష్టం ప‌రీక్షించుకున్నారు.

is pawan-kalyan-donot care about who is ready with blank check
is pawan-kalyan-donot care about who is ready with blank check

చ‌దువు కంటే మార్ష‌ల్ ఆర్ట్స్‌పై ఆస‌క్తితో వాటిలో శిక్ష‌ణ పొందిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా తొలిచిత్రం అక్క‌డ అమ్మాయి- ఇక్క‌డ అబ్బాయి. ప్రముఖ ద‌ర్శ‌కుడు ఇవివి స‌త్య‌నారాయ‌ణ తెర‌కెక్కించిన ఈ చిత్రంతో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌రాలు సుప్రియ హీరోయిన్‌గా న‌టించింది. తొలి సినిమా సూప‌ర్‌హిట్ అయిన త‌రువాత‌.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు హీరోగా నిలబెట్టాయి. 1999 లో వచ్చిన ‘తొలిప్రేమ’ లో బాలు గా యువతరాన్ని ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.

Pawan kalyan: ఖుషీ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది.

ఈ సినిమా 275 రోజులు ప్రదర్శింపబడి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా మారడానికి కారణమైంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత పవన్ కి అసాధారణమైన క్రేజ్ పెరిగింది. ఇక త‌మ్ముడు సినిమా ప‌వ‌న్‌లో న‌ట‌న‌ని బ‌య‌ట‌కు తీస్తే…బ‌ద్రి సినిమాతో ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్ సొంతమైంది. ఖుషీ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. జప‌నీస్ చిత్రాల దర్శకుడు అకీరా కురసోవా ను అమితంగా ఇష్టపడే పవన్ ఆయన స్పూర్తి తో దర్శకుడుగా ‘జానీ’ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా విజ‌య‌వంతం కాక‌పోయినా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ అద్భుతం అని విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందాయి.

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా జల్సా యూత్ లో ఎంత ఫాలోయింగ్ వుంది అనేది అందరికి తెలిసేలా చేసింది. ఇందులో కామెడీ అయితే ఇప్పటికి యూట్యూబ్‌లో రోజూ కొన్ని వేల మంది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది 100 కోట్ల పైగా వసూళ్ళు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అజ్ఞాతవాసి తర్వాత మూడేళ్లు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ హిట్ కొట్టారు. అంతేకాదు వరుసగా మరో 5 ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టాడు.

Pawan kalyan: ఆయనకి చిత్ర బృంద, కథ నచ్చితేనే అడుగు ముందుకు వేస్తాడు.

అయితే ఏ ప్రాజెక్ట్ కమిటయినా ఆయనకి చిత్ర బృంద, కథ నచ్చితేనే అడుగు ముందుకు వేస్తాడు. ప‌వ‌న్ ఊ అంటే..కాల్ష్‌షీట్స్ కోసం బ్లాంక్ చెక్‌లు ప‌ట్టుకుని క్యూలో వుంటారు నిర్మాత‌లు. కానీ ఆయ‌న స్టైలే వేరు. చేయాల‌నుకున్న‌ ప్రాజెక్ట్ వ‌ద‌ల‌డు. వద్దనుకున్న‌ ప్రాజెక్ట్ ఎన్ని కోట్లు ఆఫ‌రిచ్చినా చేయ‌డు. దటీజ్ పవర్ స్టార్. ఆయన నుంచి బీమ్లా నాయ‌క్‌, హరి హర వీరమల్లు, హరీశ్ శంకర్ సినిమా, సురేందర్ రెడ్డి సినిమా, బండ్ల గణేశ్ నిర్మాణంలో ఒక సినిమా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేయడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2022లో పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్స్ మరిన్ని అనౌన్స్ కానున్నట్టు సమాచారం.


Share

Related posts

Corona Effect: అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక నిర్ణయం..!!

somaraju sharma

Mahesh Babu: కోవిడ్ వచ్చిన సమయంలో మహేష్ బాబు చేసిన బిగ్ హెల్ప్ ఇటీవల బయటపెట్టిన అనిల్ రావిపూడి..!!

sekhar

చివ‌ర‌కు డైరెక్ట‌ర్ కూడా…

Siva Prasad