NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu Delhi Tour: సోమవారం హస్తినకు చంద్రబాబు బృందం..! రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారు..!!

Chandra Babu Delhi Tour: టీడీపీ (TDP) అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) (PattaBhi) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (YS Jagan Mohan Reddy) పై వ్యక్తిగత దూషణల దుమారం నేపథ్యంలో వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేయడం తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తూ వైసీపీపై సవాళ్లు విసిరారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాగా రాష్ట్రంలోని పరిణామాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి టీడీపీ సన్నద్దం అయిన సంగతి తెలిసిందే.

Chandra Babu Delhi Tour: President of india ramnath Kovind appointment confirmed
Chandra Babu Delhi Tour: President of india ramnath Kovind appointment confirmed

Chandra Babu Delhi Tour:రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారు

టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు గానూ ఆపార్టీ ముఖ్య నేతలు ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంత వరకూ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేల, పలువురు ముఖ్యనేతలు బృందంగా రాష్ట్రపతిని సోమవారం కలవనున్నారు. సోమవారం ప్రత్యేక విమానంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ బృందం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఏపి లో ఆర్టికల్ 356 అమలు చేయాలని రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు బృందం తమ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఉందని అంటున్నారు.

గెలవలేదు .. గుద్దుకున్నారు

చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష విరమణ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నిక ఎన్నికల నిబంధనల ప్రకారం జరిగిందా ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల్లోనూ తాము గెలుస్తామని వైసీపీ ప్రకటించుకోవడాన్ని చంద్రబాబు తప్పుబడుతూ వాళ్లు గెలవలేదు…గుద్దుకున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. పోలీసులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించడం, రిగ్గింగ్ లకు పాల్పడటం జరిగిందన్నారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వాళ్లను పట్టుకున్నామా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ పాలన ఎంత ఆరాచకంగా ఉందో ప్రజలందరికీ అర్ధం కావాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఎక్కడో అడవిలోనో, మారుమూల ప్రాంతంలోనో జరగలేదనీ, డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో జరిగిందన్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N