NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి అప్పులపై వాస్తవాలు ఇవీ.. శ్రీలంక పరిస్థితి అంటూ అసత్య ప్రచారాలు – సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వారి కృష్ణ

ఏపి అప్పుల ఊబిలో కూరుకుపోయిందనీ, శ్రీలంక పరిస్థితి మాదిరిగా తయారు అవుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రం ఈ ఏడాది వరకూ చేసిన అప్పుల విలువ ఎంత.. అప్పులను వైసీపీ ప్రభుత్వం ఏ మేరకు తగ్గించింది.. అన్న విషయాలపై స్పష్టతను ఇచ్చారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేక కార్యదర్శి దువ్వారి కృష్ణ. గురువారం నాడు ఆయన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డితో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2022 మార్చి నాటికి ఏపి మొత్తం అప్పు రూ.4,98,799 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. అదే సమయంలో ఏపి అప్పులను 2021- 22 ఏడాదికి రూ.25,194 కోట్ల మేర తగ్గించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రాలకు అప్పులను ప్రస్తావించినప్పుడు కేంద్రం కూడా తన అప్పులను చెప్పాలన్నారు. 2019 – 20 లో కేంద్రం అప్పులు దేశ జీడీపీలో 50.90 శాతానికి పెరిగాయన్నారు. ఏడాదిలోనే కేంద్రం 1,02,19,067 కోట్ల మేర అప్పులు చేసిందన్నారు. 2021 – 22 లో కేంద్రం అప్పులు 1.35 లక్షల కోట్ల మేర పెరిగాయని ఆయన తెలిపారు. ఉచిత పథకాలను కేంద్రం ఆర్ధిక కోణంలో చూస్తోందనీ, కానీ ఏపి మాత్రం ఆ పథకాలను సామాజిక పెట్టుబడి కోణంలో చూస్తొందని వివరించారు.


రాష్ట్రాన్ని ఒక దేశంతో పోల్చొకూడదు

ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక దేశాన్ని, ఒక రాష్ట్రంలో పోల్చకూడదనీ అన్నారు కృష్ణ. ఎందుకంటే.. ఒక దేశానికి చాలా బాధ్యతలు ఉంటాయి. ఎగుమతి, దిగుమతులు ఉంటాయి. విదేశీ మారకద్రవ్య నిధులు ఉంటాయి. అవి సరిపోకపోతే ద్రవ్యలోటు పెరుగుతుంది. తద్వారా దేశం అప్పులు పెరుగుతాయి. కానీ ఇవేవీ ఒక రాష్ట్రంలో ఉండవు అని అన్నారు. ఇక శ్రీలంకలో అసలు ఏం జరిగిందన్నది తెలుసుకుంటే..
వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. పన్నుల తగ్గింపు. సేంద్రీయ సాగుకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, వ్యవసాయ ఉత్పత్తులు పడిపోవడంతో ఆహారానికి కొరత ఏర్పడిందన్నారు. దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చిందన్నారు. ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో దాదాపు 29 శాతానికి చేరడంతో పాటు, జీడీపీ 3.3 శాతానికి పడిపోయిందన్నారు. శ్రీలంకలో విదేశీ అప్పు జీడీపీతో (ఎక్స్‌టర్నల్‌ డెబిట్‌ టు జీడీపీ) చూస్తే ఏకంగా 56 శాతానికి చేరిందని, ఇంకా చెప్పాలంటే ఏడాదిలోపు తిరిగి చెల్లించాల్సిన అప్పులు చూస్తే.. జీడీపీలో కానీ, విదేశీ మారకద్రవ్యంలో చూస్తే అది 467 శాతం. అంటే ఆరోజు వారి దగ్గర విదేశీ మారకద్రవ్య నిధులు 1.93 బిలియన్‌ డాలర్లు ఉంటే, వారు వెంటనే తిరిగి చెల్లించాల్సిన రుణం 4 బిలియన్‌ డాలర్ల వరకు ఉండడంతో, వారు రుణం చెల్లించడంలో విఫలమయ్యారని కృష్ణ వివరించారు. ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదనీ, అందుకే దేశం వేరు. ఒక రాష్ట్రం వేరని అన్నారు.

టీడీపీ హయాంలో ద్రవ్యలోటు

2014 నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో జీడీపీలో 3 శాతం వరకు మాత్రమే అప్పులు చేసే అనుమతి ఉండగా, ఏ ఒక్క ఏడాది కూడా వారు ఆ పరిమితికి లోబడి అప్పులు చేయలేదన్నారు. దీంతో అప్పుడు ద్రవ్యలోటు చూస్తే 2014–15లో 3.95 శాతం, 2015–16లో 3.65 శాతం, 2016–17లో 4.52 శాతం, 2017–18లో 4.12 శాతం, 2018–19లో 4.06 శాతంగా ఉందన్నారు. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020–21లో ద్రవ్యలోటు 5.44 శాతంగా ఉందన్నారు. అందుకు ప్రధాన కారణం. కోవిడ్‌ వల్ల రాష్ట్రం ఆర్థికంగా చాలా దెబ్బతిన్నదన్నారు. నిజం చెప్పాలంటే అన్ని రాష్ట్రాలతో పాటు, కేంద్రం కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2021–22లో ప్రభుత్వం చేసిన అప్పు జీడీపీలో కేవలం 2.1 శాతం మాత్రమేననీ. ఇది నిజంగా అభినందనీయమన్నారు.

ఆనాడు దారుణంగా పెరిగిన అప్పులు

జీడీపీలో 3 శాతం లోపు మాత్రమే అప్పులు తీసుకోవాలన్న నిబంధన ఉన్నా గతంలో ఏనాడూ ఆ పరిమితిలోపు రుణం తీసుకోలేదన్నారు. ఇక ఆ ప్రభుత్వం అప్పులు చూస్తే.. ఉమ్మడి రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ సంస్థలు తీసుకున్న అప్పుల మొత్తం రూ.1,34,584 కోట్లు కాగా, 2019, మే నెల నాటికి ఆ అప్పులు రూ.3,27,372 కోట్లకు పెరిగాయన్నారు. అంటే ఏటా దాదాపు 19.46 శాతం అప్పులు పెరిగాయని వివరించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో ఏటా కేవలం 15.77 శాతం చొప్పున మాత్రమే పెరిగాయన్నారు.

తప్పుడు సమాచారం. అసత్యాలు

పబ్లిక్‌ డొమెయిన్‌లో అన్ని వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయన్నారు కృష్ణ. వాస్తవానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చూస్తే..రూ.3.81 లక్షల కోట్లు కూడా లేవు కానీ పేపర్లు మాత్రం రూ.4.13 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు రాస్తున్నాయని అన్నారు. అదే విధంగా ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ సంస్థలు చేసిన వాస్తవ అప్పులు కేవలం రూ.1.17 లక్షల కోట్లు కాగా, అవి రూ.1.38 లక్షల కోట్లు అని రాస్తున్నాయన్నారు. ఈ విధంగా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల, అసత్యాలు ప్రచారం చేయడం వల్ల రాష్ట్రానికే చెడ్డ పేరు వస్తుందని ఆయన పేర్కొన్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N