NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ‘ప్రజాదీవెన ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోను’

Share

CM YS Jagan:  ప్రజా దీవెన తనకు ఉన్నంత వరకూ ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తోడేళ్లంతా ఎకమవుతున్నారని మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారని .. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని అలోచించాలన్నారు.

ఏలూరు జిల్లా నూజివీడు నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్త గా 42,307 మంది డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతో పాటు అసైన్డ్ భుములకు భూయాజమాన్య హక్కు కల్పించడం, లంక భూములకు పట్టాలను అందజేశారు. చుక్కల భుములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుండి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు.

శ్మశాన వాటిక లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 11,563 గ్రామాల్లో 931 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా భూసర్వే వల్ల ఎంత మంది రైతులకు సమస్యలను పరిష్కరించడం జరిగింది అనే విషయాలను, ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న మేళ్లను వివరించారు. ఇదే క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపైనా విమర్శలు గుప్పించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని, అన్నారు. చంద్రబాబుకు మిగతా సామాజికవర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు.

ఇచ్చిన మేనిఫెస్టో పై కమిట్ మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు జగన్. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీయే జరిగిందని అన్నారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలి సారి వెన్నుపోటుతో, రెండో సారి కార్గిల్ యుద్దం పుణ్యాన, మూడో సారి రుణ మాఫీ తో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు సీఎం జగన్.

Telangana Election: కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు కీలక నేతలు .. ఒకరు బీజేపీ, మరొకరు బీఆర్ఎస్ నుండి ..


Share

Related posts

నిహారిక వెడ్డింగ్ ఇన్విటేషన్ అందిన ఆ లక్కీ హీరోయిన్లు ఎవరంటే?

Yandamuri

బిత్తిరి సత్తి కి పర్మినెంట్ జాగా దొరికినట్లేనా..?

somaraju sharma

జగన్ భయపడే మాట చెప్పిన పవన్?

sridhar