BrahmaMudi:బ్రహ్మముడి సీరియల్ మానస్ నాగులపల్లి, ఈ సీరియల్ లో రాజ్ క్యారెక్టర్ లో మెయిన్ లీడ్ పాత్ర లో నటిస్తున్నారు. మానస్ నాగులపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ సుపరిచితమే, బిగ్ బాస్ తో చాలా ఫేమయ్యాడు మానస్, ఇక ఇటీవల మానస్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే అయితే తాజాగా తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తేదీని ప్రకటించేసాడు మానస్, అది అందరి ముందు స్టేజ్ మీద తన పెళ్లి డేట్ ని ప్రకటించాడు. ఇక తన అభిమానులందరికీ, గుడ్ న్యూస్ ఒకేసారి చెప్పేశాడు మానస్.

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా అందరి మనసులు గెలుచుకుంటున్న,మానస్ నాగులపల్లి. ఈ సీరియల్ ఇంతలా సక్సెస్ అయిందంటే కారణం రాజ్, కావ్య పాత్రలే అని చెప్పొచ్చు. స్టార్ మా లో మంచి పిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇదే, ఈ సీరియల్కు చాలామంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా రాజు పాత్రలో నటిస్తున్న మానస్ కి ప్రత్యేకమైన ప్రేక్షకుదరణ ఉంది. రాజ్ క్యారెక్టర్, కోపం, ప్రేమ, అమాయకత్వం హీరోఇజం ఇలా అన్ని ఎమోషన్స్ ని, ఒకే పాత్రలో చూపించే క్యారెక్టర్ రాజ్ ది. ముఖ్యంగా కావ్య రాజ్ జోడి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులు చాలా సంతోషిస్తారు. సీరియల్ లో ఎలాగైతే కావ్య రాజ్ కి జోడిగా ఎంత బాగుందో నిజజీవితంలో కూడా మన మానస్ కి శ్రీజ అంతే బాగా జోడి గా కుదిరారు అని చెప్పవచ్చు. ఈ విషయం రాజ్ ఎంగేజ్మెంట్ రోజు అందరికీ తెలిసిందే, స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో, రాజ్ కి బ్రహ్మముడి సీరియల్ ఎక్ గాను, అవార్డ్స్ అందుకున్నాడు. ఇక ఇదే స్టేజ్ మీద తన పెళ్లి డేట్ కూడా చెప్పేసాడు మానస్.

స్టార్ మా పరివార్ అవార్డ్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ మెల్ విభాగంలో మానస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రోగ్రాం లో మానస్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో కూడా ప్లే చేశారు అందులో తన కాబోయే భార్య, శ్రీజ గురించి కొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. ఇక తరువాత నా పెళ్లి నవంబర్ 22న జరగనుంది అని మానస్ అందరి ముందు బయట పెట్టాడు. అందరూ ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి మీది లవ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు మాది లవ్ మ్యారేజ్ కాదు. ఇది అరేంజ్డ్ మ్యారేజి అర్థం చేసుకునే మనిషి నా భార్యగా వస్తే అంతే చాలు అనుకున్నాను ఆ క్వాలిటీస్ అన్ని నేను నా భార్య శ్రీజలో చూశాను అందుకే యాక్సెప్ట్ చేశాను అని, అందరి ముందు తన భార్యని పొగుడుతూ చెప్పాడు. ఇక మానస్ నేను ఫ్యామిలీ మెన్ కాబోతున్నాను అన్న ఫీలింగ్ ఏ నాకు చాలా బాగుంది ఈ గుడ్ న్యూస్ ని మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా బాగుంది అని, తన మనసులో మాటలన్నీ అవార్డు ఫంక్షన్లో పంచుకున్నాడు. ఇక ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక మానస్ చెన్నై అల్లుడు కాబోతున్నాడు అన్న విషయం కూడా మనకి ఎంగేజ్మెంట్ జరిగిన రోజే తెలిసింది. అదెలా అంటారా కావ్య కంగ్రాట్స్ చెన్నై అల్లుడు అంటూ ఎంగేజ్మెంట్ ఫొటోస్ కి కామెంట్ చేసింది దీనితో ఈ విషయం ఆడియన్స్ అందరికీ తెలిసిపోయింది. సో మన మానస్ ఇటు ఆంధ్ర అటు చెన్నైలోనూ అభిమానుల్ని సంపాదించుకుంటున్నాడన్నమాట. మనందరం మానస్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..