NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS AB Venkateswara Rao: ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు

IPS AB Venkateswara Rao: ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల తర్వాత తిరిగి బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పట్ల పూర్తి అవగాహన తనకు లేదన్నారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కు గతంలో ఘనకీర్తి ఉండేదనీ, ఉమ్మడి రాష్ట్రంలో ప్రింటింగ్ విభాగం ఆదరణ పొందతూ వచ్చిందని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఇక్కడే ప్రింటింగ్ అయ్యేవన్నారు. ప్రస్తుత కార్యకలాపాలపై సిబ్బందితో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

IPS AB Venkateswara Rao took Charge as Printing and Stationary Commissioner
IPS AB Venkateswara Rao took Charge as Printing and Stationary Commissioner

IPS AB Venkateswara Rao: ప్రాధాన్యత లేని పోస్టింగ్ గా భావించడం లేదు

సాధారణంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు దీనిని లూప్ లైన్ పోస్టు గా భావిస్తుంటారు. కానీ ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం ఇది ప్రాధాన్యత లేని పోస్టింగ్ గా భావించడం లేదని పేర్కొన్నారు. నియామకాల విషయం ప్రభుత్వం తన ఆలోచనల మేరకు చేస్తుందని చెప్పారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు ముందుగా ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయం మొత్తాన్ని పరిశీలించారు. అయితే తనకు ప్రత్యేకంగా ఛాంబర్ లేకపోవడంతో డిప్యూటి జనరల్ మేనేజర్ రూమ్ లోనే ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.

న్యాయ పోరాటం చేసి

ఏబి వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారన్న అబియోగాలపై జగన్ సర్కార్ ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. అయితే సస్పెన్షన్ ఎత్తివేసిన తరువాత కూడా కొద్ది రోజులు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో పలు మార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాలు పంపిన నేపథ్యంలో తాజాగా ప్రింటింగ్ స్టెషనరీ కమిషనర్ గా నియమిస్తూ పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడంతో నేడు విధుల్లోకి జాయిన్ అయ్యారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N