NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : మంత్రి కొడాలికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షాక్ …

Nimmagadda : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత ఎన్నికలు వద్దన్నా ప్రభుత్వం ఇప్పుడు సహకరిస్తూనే ఉంది. ఎన్నికల సంఘానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తూ ఉంది. మొత్తం నాలుగు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి అయ్యాయి. రెండవ దశ పోలింగ్ రేపు శనివారం జరగనున్నది.

Nimmagadda : ap sec issued notice minister kodali nani
Nimmagadda ap sec issued notice minister kodali nani

ఈ తరుణంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గతంలో మాదిరిగానే తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేస్తూ పనిలో పనిగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎస్ఈసీ సీరియస్ అయ్యింది. కొడాలి నానికి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం అయిదు గంటల లోగా వ్యక్తిగతంగా గానీ, ప్రతినిధి ద్వారా గానీ వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని..ఎస్ఈసీ నోటీసుపై ఏ విధంగా స్పందిస్తారు ? తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటారా ? అనేది ఇప్పుడు  ఆసక్తికరంగా మారింది.

Nimmagadda : ap sec issued notice minister kodali nani
Nimmagadda ap sec issued notice minister kodali nani

ఎస్ఈసీ ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకున్నది. ఈ నెల 17వ తేదీ వరకూ మీడియాతోనూ, సభలు, సమావేశాల్లో మాట్లాడటానికి వీలులేదని ఎస్ఈసీ ఆదేశాలు చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. అయితే దీనిపై నోటీసులు ఇవ్వకుండా చర్యలు ఎలా తీసుకుంటారని జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు. తనపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలంటూ ఆయన ఎస్ఈసీకి లేఖ రాశారు.

కాగా.. ఇంతకు ముందు నోటీసులు ఇవ్వకుండా నేరుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మంత్రి కొడాలి నానిపై చర్యలకు గానూ ఎస్ఈసీ ముందుగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న తరుణంలో మంత్రి నాని వివాదాస్పద వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసుల అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju