Subscribe for notification

Pawan Kalyan: అమలాపురం ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్…ప్రజలందరూ సంయమనం పాటించాలని వినతి

Share

Pawan Kalyan: కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలావురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో మంగళవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళన కారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలపై ప్రతిపక్షాలపై అనుమానం ఉందంటూ హోంశాఖ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. పత్రికా ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan press note on amalapuram issue

Pawan Kalyan: ప్రజలు సంయమనం పాటించాలి

అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్య వాదులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. ప్రజలు అందరూ సంయమనం పాటించాలని పవన్ కళ్యాణ్ కోరారు. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుందని అన్నారు. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువు గా మార్చడం దురదృష్టకరమని ఆ మహానీయుని పేరును వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

 

వారి వైఫల్యాలను జనసేన పై రుద్దవద్దు

అమలాపురంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని ఆరోపించారు పవన్ కళ్యాణ్. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. వాళ్ల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లా వాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. బాధ్యత కల్గిన పదవిలో ఉన్న హోంశాఖ మంత్రి ప్రకటన చేస్తూ జనసేన పేరును ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వ లోపాలను, శాంతిభద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేన పై రుద్దవద్దని పవన్ కళ్యాణ్ కోరారు.


Share
somaraju sharma

Recent Posts

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

2 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

3 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

5 hours ago

Upasana: పిల్లల విషయంలో రామ్ చరణ్ భార్య వేసిన ప్రశ్నకు సద్గురు సంచలన సమాధానం..!!

Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

5 hours ago

Bimbisara: ‘బింబిసార’ తాత గారికి అంకితం కళ్యాణ్ రామ్ సంచలన కామెంట్స్..!!

Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) 'బింబిసార'(Bimbisara) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బింబిసార' సినిమా…

5 hours ago

Pavitra Lokesh: పోలీస్ కంప్లైంట్ చేసిన పవిత్ర లోకేష్..!!

Pavitra Lokesh: గత కొద్ది రోజుల నుండి నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) లకి సంబంధించి వార్తలు మీడియాలో సోషల్…

5 hours ago