Subscribe for notification

Petrol Diesel prices: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపులో కేంద్రం వంతు అయిపోయింది .. ఇక రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నేతల డిమాండ్

Share

Petrol Diesel prices: పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఒక సారి ఇప్పుడు తాజాగా మరో సారి ఎక్సైజ్ సుంకం తగ్గించింది. పెట్రోల్ లీటరు ధర రూ.120లు, డీజిల్ లీటరు ధర రూ.105లు పైగా చేరిన సంగతి తెలిసిందే. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపైనా పడింది. ధరల పెరుగుదలతో వాహనదారులు, పేద మద్యతరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు.

Petrol Diesel prices: Bjp leaders demand Decrease VAT

Petrol Diesel prices: తెలుగు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.8లు, డీజిల్ పై రూ.6లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50ల మేర తగ్గనుండగా, లీటర్ డీజిల్ ధర రూ.7ల మేర తగ్గుతోంది. ఇంతకు ముందు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన సమయంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ను తగ్గించాయి. అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదు. ఇప్పుడు మరో సారి కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఆరు నెలల్లో రెండు సార్లు ఎక్సైజ్  సుంకం తగ్గింపు

ఆరు నెలల్లో రెండు పర్యాయాలు పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు స్పందిస్తూ ప్రధాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యాట్ ను విపరీతంగా పెంచడంతో ఏపిలో పెట్రోల్, డీజిల్ ధఱలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని జీవీఎల్ ఆరోపించారు. ప్రజలకు ఉపశమనం కల్గించడానికి ఏపి సీఎం వైఎస్ జగన్ కూడా కేంద్రం తరహాలోనే భారీగా వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు జీవీఎల్. లేకపోతే బీజేపీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతుందని జీవీఎల్ హెచ్చరించారు.

Petrol Diesel prices: భారీగా ఆదాయం తగ్గుతున్నా

మరో పక్క తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే విధంగా సీఎం కేసిఆర్ కు సూచన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేసిన బండి సంజయ్.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గుతుందని తెలిసినా ఎక్సైజ్ సుంకం తగ్గించిందని అన్నారు. కేంద్రం మాదిరిగానే కేసిఆర్ సర్కార్ కూడా వ్యాట్ ను తగ్గించి ప్రజలకు మరింత ఉపశమనం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు బండి సంజయ్, లేని పక్షంలో కేసిఆర్ సర్కార్ ప్రజాగ్రహాన్ని చవిచూస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ నేతల డిమాండ్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


Share
somaraju sharma

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

15 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

1 hour ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago