NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Badvel Bypoll: బద్వేల్ బైపోల్ బీజేపీ అభ్యర్థిగా యువజన నాయకుడు..!!

Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థిగా పుంతల సురేష్ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బద్వేల్ ఉప ఎన్నిక బరిలో బీజేపి అభ్యర్థిగా ప్రజా సమస్యల సాధనకై అనేక పోరాటాలు సాగించిన యువ నాయకుడు పుంతల సురేష్ దిగుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల సాధనకై గల్లీ నుండి ఢిల్లీ వరకూ పోరాటం చేయగల యువజన నాయకుడిని గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.

Puntala Suresh is the bjp candidate in Badvel Bypoll
Puntala Suresh is the bjp candidate in Badvel Bypoll

Badvel Bypoll: బీజేవైఎస్ జాతీయ కార్యదర్శి పుంతల సురేష్

తొలుత బద్వేల్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జయరాములును ఖరారు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో ప్రస్తుతం బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్న పుంతల సురేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. టీడీపీ నుండి డాక్టర్ దాసరి సుధ, కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే పీఎమ్ కమలమ్మలు ఇప్పటికే నామినేషన్ లు దాఖలు చేసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలకు జనసేన, టీడీపీ దూరంగా ఉన్నాయి. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు నవతరం పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో నిలవడంతో ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.

ఎన్నికలకు దూరంగా జనసేన, టీడీపీ

దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను అధికార వైసీపీ పోటీకి దింపిన నేపథ్యంలో సంప్రదాయాలను అనుసరించి జనసేన, టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాయి. ఇతర రాజకీయ పక్షాలు పోటీ నుండి దూరంగా ఉంటే దాసరి సుధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు ఏకగ్రీవ ప్రతిపాదన చేసి ఉంటే పార్టీలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉండేది. కానీ వైసీపీ నుండి ఇతర రాజకీయ పక్షాలకు అటువంటి ప్రతిపాదన ఏమీ పంపలేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. వైసీపీ ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోయింది. రేపటి వరకూ నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N