ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Rain Alert To Andhra Pradesh: ఏపిలో నేడు రేపు వర్షాలు

Share

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపిలో గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాలో గురువారం అక్కడక్కడ భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో రెండు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ట్లు చెప్పింది.

AP Rain alert
AP Rain alert

 

తుర్పు మద్య బంగాళాఖాతంలో, దాన్ని ఆనుకని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ తుఫాను ప్రభావం విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. తూర్పు మద్య బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకూ ద్రోణి ప్రవహిస్తొందని అమరావతి కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఉమురులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందుని విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఆయన సూచించారు.

ఏపి ఉద్యోగులకు కీలక హామీ ఇచ్చిన మంత్రి బొత్స

 


Share

Related posts

ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్!ఆలయాల్లో ప్రమాణాల పర్వం!నిన్న అనపర్తి …నేడు విశాఖ!!

Yandamuri

Job update: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూ ఆధారంగా కొలువు..!!

bharani jella

ఏపి గృహ నిర్మాణ శాఖ పై సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma