Road Accident: అరకు ఘాట్ రోడ్డులో అనంతగిరి హెయిర్ పిన్ బెండ్ దగ్గర కల్వర్టుకు ఓ కారు ఢీకొట్టింది. కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. కారు తీసే మార్గం కనబడకపోవడంతో అందులోని వ్యక్తులు అక్కడ నుండి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడటంతో అక్కడి నుండి ఆసుపత్రికి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు, అటుగా వెళుతున్న వారు భావించారు. అయితే ఘటనా స్థలానికి వచ్చి కారును పరిశీలించిన పోలీసులకు అసలు విషయం తెలిసి, కారులోని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. .

ఎందుకంటే.. ? ప్రమాదానికి గురైన కారులో భారీగా ఉండటాన్ని పోలీసులు గమనించారు. కారులో ఆరు గంజాయి బస్తాల మూటలు ఉన్నాయి. కారులో ఉన్న వారు గంజాయి (అక్రమ రవాణాదారులు) స్మగ్లర్ లు అని, అందుకే వారు కారు అక్కడే వదిలివేసి పరారైయ్యారని భావిస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా స్మగ్లర్ లను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నా అరకు అటవీ ప్రాంతం నుండి గంజాయి స్మగ్లింగ్ జరుగుతునే ఉంది. వివిధ ప్రాంతాల్లో తనిఖీల్లో గంజాయి నిల్వలను పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం.