Intinti Gruhalakshmi: నందు కేఫ్ కి మొదటి కస్టమర్ వచ్చి వెళ్ళిపోతాడు.. మరో కస్టమర్ ఎప్పుడు వస్తారు అని అంతా ఎదురు చూస్తూ ఉండగా.. తులసి ఇంట్లో అందర్నీ తల ఒక చైర్ లో కూర్చొని చెబుతుంది. కేఫ్ అంతా కష్టమర్స్ తో కలకల్లాడుతుంటే బయటి వాళ్లు రావడానికి ఆకర్షితులు అవుతారని తులసి మార్కెట్ స్ట్రాటజీని అప్లై చేస్తుంది.. సో.. ఫైనల్ గా ఓ కస్టమర్ లోపలికి వస్తారు.. కిటో బర్గర్ కావాలని ఆర్డర్ చేస్తుంది.

కిటో బర్గర్ తులసి చేసి ఇస్తుంది. మేము చెప్పిందే చేశారా అని అడుగుతుంది ఆ కస్టమర్. నువ్వు నందు పరువు తీయ కు అని లాస్య తులసికి క్లాస్ పీకుతుంది. ఏమైంది బాగోలేదా అని అడగగానే చాలా బాగుంది. నేను ఇప్పటివరకు చాలా రెస్టారెంట్స్ లో తిన్న కీటో బర్గర్ కంటే ఈ కీటో బర్గర్ చాలా అద్భుతంగా ఉంది మా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికే రమ్మని చెబుతాను. అలాగే ఒక ఫైవ్ కీటో బర్గర్ కూడా పార్సల్ చేసి ఇవ్వమని చెబుతుంది.

Intinti Gruhalakshmi: గాయత్రి దెబ్బకు లాస్య కౌంటర్.. తులసికి చివాట్లు పెట్టిన లాస్య..
ఈరోజుకి కేఫ్ ఏ క్లోజ్ చేసే టైం అయిందని లాస్య అంటుంది. ఇక ఇంట్లో అందరూ వెళ్లిపోబోతుండగా.. ఇంకా కొన్ని ఐటమ్స్ మిగిలే ఉన్నాయని శృతి అంటుంది. అయితే ఈరోజు మా ఆయన మన అందరికీ పార్టీ ఇస్తాడని అనసూయమ్మ అంటుంది. వాటన్నింటికీ మీరు బిల్ కట్టండి మేము అందరం ఇక్కడే డిన్నర్ చేసేసి వస్తాము అని అంటుంది. పరంధామయ్య నవ్వుతూ ఓకే అని అంటాడు.

కేఫ్ లో నుంచి అందరూ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత.. నందు తులసి దగ్గరకు వెళ్లి ఈరోజు మొత్తం మీద నేను సంపాదించిన డబ్బులు 1500 అని తులసికి ఆనందంగా చూపిస్తాడు. మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత నా కాలం మీద నేను నిలబడి డబ్బులు సంపాదించడం నాకెంతో ఆనందంగా ఉంది. నా మీద నాకు మళ్ళీ నమ్మకం వచ్చేలాగా చేసింది నువ్వే.. థాంక్యు తులసి ఎప్పుడూ నాకు ఇలాగే అండగా ఉండు అని నందు అడుగుతాడు. అందుకు నీ భార్య లాస్య ఉంది కదా అని తులసి అంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో లాస్య అన్నట్టుగా అందుకే మధ్యలోనే మూత పడిపోకుండా ఉండాలంటే.. ఈ కేఫ్ గురించి మరింత ప్రచారం ముందుకు తీసుకెళ్లాలి. అందుకు ఉపయోగపడటానికి ఓ పాంప్లెట్ కోసం తులసి మ్యాటర్ రాయడానికి ప్రయత్నిస్తుంది. ఎన్నోసార్లు ట్రై చేసిన తర్వాత తులసి ఒక మంచి మ్యాటర్ను రెడీ చేసి ఆ పాంప్లెట్ ను ప్రింట్ చేయిస్తుంది.

ఆ పాంప్లెట్స్ చూసి నందు నందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటి నాన్న ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అని ప్రేమ అడుగుతారు. ఒకప్పుడు నాకు ఎవ్వరూ లేరు అని అనుకునేవాడిని ఇప్పుడు నాకు మీ అందరూ అండగా నిలబడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని నందు ఎమోషనల్ అవుతాడు.