Intinti Gruhalakshmi: ప్రేమ్ గిటార్ తీసుకువచ్చి ఓ పాట పాడుతూ తులసిని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. అంతలో అభి వచ్చి నన్ను క్షమించు అంటూ గుంజీల్లు తీస్తాడు. తన కాళ్ళ మీద పడిపోతుండగా అభి ని తులసి పైకి లేపి హత్తుకొని ఏడుస్తుంది. ఇక అభి కళ్ళతో ప్రేమ్ ని గిటార్ వాయించమని సైగ చేస్తాడు. దూరంగా ఉన్న నందు లాస్య ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ ఉంటారు అప్పుడే నందు లాస్యతో బంధం అంటే ఇలాగే ఉంటుంది. ఎప్పుడు మాటలే కాదు సంతోషం కూడా ఉంటుంది అని అంటాడు..

నందు కేఫ్ ఘనంగా ఓపెన్ చేస్తారు. అనసూయమ్మ పరంధామయ్య ఇద్దరు ఆ కేఫ్ ను ఓపెన్ చేస్తారు. తులసి నందు కొబ్బరికాయ కొట్టి లోపలికి వస్తారు.. ఇంట్లో వాళ్ళందరూ కలిసి.. తులసి నందు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.. వాళ్ళిద్దర్నీ చూసి గాయత్రి లాస్యతో మాజీ మొగుడు మాజీ భార్య మళ్ళీ ఒకరిపై ఒకరికి మోజు పుట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.. మళ్లీ వాళ్ళిద్దరూ దగ్గర అయితే అని గాయత్రి లాస్య మనసులో అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది..

Intinti Gruhalakshmi: గాయత్రి మాటలతో లాస్య గుండెల్లో గుబేలు.. నందు తులసి పై అనుమానం మొదలైందా.!?
అవునా.. నా సంగతి అలా ఉంచు ముందు నీ కూతురు ఈ కేఫ్ లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ముందు అంకిత సంగతి చూడు ఆ తర్వాత నా గురించి ఆలోచించు అని తనకి హాస్పటల్ కంటే కేఫ్ లోనే ఉండటమే ఇంపార్టెంట్ అని అనుకుంటుంది ముందు తన సంగతి చూడు అన్నట్లుగా లాస్య దెబ్బకు దెబ్బ కొడుతుంది.గాయత్రి కి ఇక గాయత్రి మరో మాట మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది..

ఇక తులసి పూజ చేస్తుండగా లాస్య తన దగ్గరికి వెళ్లి నా కేఫెలో పూజ చేస్తావా అంటూ హారతి పళ్ళెం ను పట్టుకుంటుంది. ఏమైంది లాస్య ఎందుకు హారతి పళ్ళాం ఆపావు అంటూ తులసి కోపంగా అడుగుతుంది. నాది నాకే ఫ్లో నేను కాకుండా ఇంకెవరు పూజ చేస్తారు అని లాస్య అంటుంది. హారతి పళ్లెం ఇచ్చేసి పక్కకు వెళ్ళిపోతుంది తులసి అందులో మొదటి కస్టమర్ వచ్చి మీరు గొడవ పడుకో అంటున్నారు కదా అని వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తారు అని అంతా ఎదురు చూస్తూ ఉండగా ఫైనల్ గా ఓ కస్టమర్ లోపలికి వస్తారు. తులసి సాండ్విచ్ చేసి ఇస్తుంది. మేము చెప్పిందే చేశారా అని అడుగుతుంది ఆ కస్టమర్. నువ్వు నందు పరువు తీయ కు అని లాస్య తులసికి క్లాస్ పీకుతుంది.