Intinti Gruhalakshmi: ఇంట్లో అందరూ కెఫేకి సంబంధించిన ప్లేస్ చూడడానికి వెళ్తారు. ఆ ప్లేస్ అంతగా బాగోదు. శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ స్థలాన్ని చూసి ఆలోచనలో పడతారు. అలా ఒక్కరు తల ఒక చెయ్యి వేస్తే సరిపోతుంది. కేఫ్ అందంగా తయారు చేస్తామని తులసి అంటుంది. అయితే చేసి చూపించండి అని లాస్య అంటుంది.

అంకిత ను కూడా తనతో పాటు హాస్పిటల్ కి రమ్మని చెబుతాడు. అంకిత నేను రాను అవి మొహం మీదే చెప్తుంది. దాంతో కోపంగా అవి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక కేఫ్ ను అందంగా తయారు చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ.. అనసూయమ్మ మెనూని కేఫ్ భాషలో తయారు చేసి షాక్ అయ్యేలా చేస్తుంది తులసి. ఇక ఆ కేఫ్ నుంచి ఇంటికి వస్తారు అంతా..

కేఫ్ ఓపెనింగ్ కి ఎవరెవరిని పిలవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వచ్చిన వారందరికీ టిఫిన్ స్నాక్స్ ఏం పెట్టాలో అని మాట్లాడుకుంటూ ఉండగా అభి వస్తాడు.. పరంధామయ్య కేఫ్ గురించి చెబుతుండగా అదేదో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లా.. మళ్ళీ అందరూ ఎందుకు అంత డిస్కషన్ చేస్తున్నారు అని అబి చిరాగ్గా అంటాడు. ఈ కేఫ్ ఓపెనింగ్ కి మీ అత్తయ్య గాయత్రి ని కూడా పిలుస్తున్నావని అభి నీ తులసి అడుగుతుంది.

నాకు రావడానికి చిన్నతనంగా ఉంది ఇక మా అత్తయ్యని నాకు లింక్స్ ను ఎలా పిలుస్తాను నేను పిలవను అని అభి అంటాడు. నీకు చిన్నతనంగా అనిపించే పని మీ నాన్న ఎప్పుడు చేసాడు. అయినా తను దొంగతనం ఇంకోటి ఏదో చేయడం లేదు అందులో తప్పేముంది అని తులసి అభికి చివాట్లు పెడుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో నందు కేఫ్ ఘనంగా ఓపెన్ చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి.. తులసి నందు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.. వాళ్ళిద్దర్నీ చూసి గాయత్రి లాస్యతో మాజీ మొగుడు మాజీ భార్య మళ్ళీ ఒకరిపై ఒకరికి మోజు పుట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.. మళ్లీ వాళ్ళిద్దరూ దగ్గర అయితే అని గాయత్రి లాస్య మనసులో అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది.. ఇక తులసి పూజ చేస్తుండగా లాస్య తన దగ్గరికి వెళ్లి నా కేఫెలో పూజ చేస్తావా అంటూ హారతి పళ్ళెం ను తీసుకుంటుంది. మిగతా విశేషాలు రేపటి భాగంలో చూద్దాం.