Rain Alert: తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపిలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురస్తాయని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. రేపు కోనసీమ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

అలానే ప్రకాశం, నెల్లూరు జల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యనాసియ, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షం సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండరాదని విపత్తుల సంస్థ సూచించింది. రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత .. ఎయిమ్స్ లో చికిత్స