NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Nimmagadda : నిమ్మ‌గ‌డ్డ‌ ను ఇరికించిన జ‌గ‌న్ .. జైలు పాలు చేస్తాం జాగ్ర‌త్త అంటూ….

ap government upper hand on nimmagadda

Nimmagadda ramesh ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఖ‌రి, ఏపీలో స్థానిక సంస్థ‌ల అంశం, విధానం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ap government upper hand on nimmagadda

పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్.. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Nimmagadda  నిమ్మ‌గ‌డ్డ దూకుడు…

స్థానిక సంస్థల ఎన్నిక‌ల విష‌యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ దూకుడు పెంచారు. ఈ ఉదయం 11 గంటలకు
కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరుకానున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు, ఓటర్లజాబితా రూపకల్పన తదితర అంశాలపై చర్చ జరపనున్నారు.

Nimmagadda స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు…

 

ఈ పంచాయతీ ఎన్నికలు చారిత్రాత్మకం అని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. గెలవనున్న గ్రామ సర్పంచులు…తమ పాలన తామే చేసే అభ్యుదయ వాతావరణం ఇప్పుడు వచ్చిందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కక్షలు, పట్టుదలలకు అవకాశం ఉంటుందని, అటువంటి వాటికి అవకాశం లేకుండా అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే విధంగా ప్రయత్నించాలని అన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు జనాభాను బట్టి 5 నుంచి 20 లక్షల వరకు ప్రోత్సాహకం ఇచ్చే విధంగా చట్టంలో మార్పులు తీసుకుని వచ్చామని అన్నారు. ఏకగ్రీవాలు ఎక్కువ జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న ఆయన జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే వదిలి కొత్తగా పంచాయతీ ఎన్నికలను కొత్తగా తీసుకుని రావడం వెనుక నిమ్మగడ్డ ర‌మేష్‌ కు వేరే ఉద్దేశాలు ఉన్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. గత 50 ఏళ్లుగా అందరూ ఏకగ్రీవాల కోసమే ప్రయత్నిస్తుంటే నిమ్మగడ్డ మాత్రం ఏకగ్రీవాల పై పచ్చటి పల్లెల్లో వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని అనిపిస్తోందని అన్నారు. ఎవరైనా కుట్రలకు, వయోలెన్స్ కు పాల్పడి గెలిచినా ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం ప్రకారం అనర్హత వేటు పడుతుందని, జైలు శిక్షలు కూడా ఉంటాయని అన్నారు. శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ పడే అవకాశం కూడా ఈ చట్టం ప్రకారం కోల్పోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ చట్టం కఠినంగా అమలు చేస్తామని ప్ర‌క‌టించారు.

ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి?

ఎస్ఈసీతో వీడియో కాన్ఫరెన్స్ నేప‌థ్యంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ అత్యవసర భేటీ అయ్యారు. ఎన్నికల విధుల నిర్వహణ విషయమై ఉద్యోగ సంఘల నేతలతో చర్చ నిర్వహించారురు. కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణ విషయమై ఉద్యోగులు అభ్యంతరాలు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాలను.. సూచనలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లాయి .

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N