ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించింది. టిడిపి నుండి దిగిన బీసీ మహిళ నేత పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఆమెకు 23 ఓట్లు రావడంతో విజయం నమోదయింది. క్రాస్ ఓటింగ్ జరగకుండా నివారించేందుకు వైసిపి పకడ్బందీ వ్యూహాలు రచించినప్పటికీ టిడిపికి నాలుగు ఓట్లు అదనంగా వచ్చాయి. అసెంబ్లీలో టిడిపి నైతిక బలం 19 అయినప్పటికీ 24 ఓట్లు రావడం గమనార్హం.

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఈ వేళ ఉదయం 9 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఐదు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించగా మొత్తం 175 ఓట్లు చెల్లుబాటు అయినట్లుగా ముందుగా ప్రకటించారు. అనంతరం హోటల్ లెక్కింపు కొనసాగుతోంది. వైసిపి ఏడవ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తీవ్రంగా కష్టపడింది. ప్రతి ఒక్క ఓటు ఈ ఎన్నికలో కీలకని కావడంతో నెల్లిమర్ల ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఫైట్ ఏర్పాటు చేసి మరి వైసిపి తీసుకొచ్చింది. అయినప్పటికీ క్రాస్ ఓటింగ్ కారణంగా వైసిపి కి ఊహించిన దెబ్బ తగిలింది. టిడిపి అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మొదటి ప్రాధాన్యత ఓటుతో టీడీపీ ఒకటి, వైసీపీ అయిదు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నాయి. టీడీపీ నుండి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించగా, వైసీపీ అభ్యర్ధులు సూర్యనారాయణ రాజు (22), బొమ్మి ఇజ్రాయిల్ (22), పోతుల సునీత (22), మర్రి రాజశేఖర్ (22), ఏసురత్నం (22) ఓట్లతో విజయం సాధించారు. ఏడవ ఎమ్మెల్సీ స్థానానికి కొలా గురువులు (21), జయమంగళం వెంకటరమణ (21) పోటీ పడుతున్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.