NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపు…బంద్ కు బీజేపీ, జనసేన మద్దతు..కానీ

Advertisements
Share

Chandrababu:  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది. కాగా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడపీ రేపు (సోమవారం) రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Advertisements

40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కల్గిన చంద్రబాబు అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో రేపు (సోమవారం) ఆంధ్రప్రదేశ్ లో బంద్ చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజా స్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజా స్వామ్యవాదులు అందరూ స్వచ్చందంగా పాల్గొనాలని అచ్చెన్న పిలుపు నిచ్చారు. టీడీపీ బంద్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేశారు.

Advertisements

టీడీపీ ఇచ్చిన బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. ప్రజా స్వామ్య స్పూర్తికి విరుద్దంగా జరిగిన చంద్రబాబు అక్రమ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలకపక్షం ఒడిగడుతోందని విమర్శించారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. రేపు జరగబోయే బంద్ లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు పవన్ కళ్యాణ్.

మరో పక్క బీజేపీ కూడా టీడీపీ బంద్ కు మద్దతు తెలియజేస్తున్నట్లుగా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి పేరుతో ఓ లెటర్ సోషల్ మీడియాలో సర్యులేట్ అయ్యింది. అయితే అది ఫేక్ లెటర్ అని ఏపీ బీజేపీ ప్రకటించింది. బీజేపీ పేరుతో ఫేక్ లెటర్ సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ కు పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తొంది. కాగా చంద్రబాబు ను అరెస్టు చేసే సమయంలో సీఐడీ అధికారులు ప్రొసీజర్ ఫాలో కాలేదనీ, అలా అరెస్టు చేయడం సమర్ధనీయం కాదని దగ్గుబాటి పురందీశ్వరి ఇప్పటికే ఖండించారు.


Share
Advertisements

Related posts

శ్రీనివాసుడి చెంత నీలి చిత్రాలా? ఇదేమి పోయేకాలం ! ఎస్వీబిసిలో వివాదం

Special Bureau

గుంటూరు నుండే పార్టీ కార్యక్రమాలు

somaraju sharma

రకుల్ ఆ హీరోయిన్ ని ఫాలో అయితే దెబ్బ తింటుందా ..?

GRK