Naresh Pavitra: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఇంకా పవిత్ర పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ సంబంధించి దాదాపు ఏడాదికి పైగా సోషల్ మీడియాలో ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మూడో భార్య రమ్య రఘుపతితో మనస్పర్ధలు వచ్చిన తర్వాత పవిత్రకి క్లోజ్ అయిన నరేష్.. ఇటీవల పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో చాలా గొడవలు కూడా జరిగాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీళ్లిద్దరిపై మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇలా ఉంటే ఒకపక్క అన్నతో గొడవలు జరుగుతున్నా కానీ… పవిత్ర తోనే నరేష్ తన రిలేషన్ కొనసాగించి చివర ఆఖరికి పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఇటీవల “మళ్ళీ పెళ్లి” అనే సినిమా కూడా పవిత్రతో నరేష్ నిర్మాతగా వ్యవహరించి సినిమా చేయడం జరిగింది.
ఈ సినిమాలో హీరోగా నరేష్ నటించడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి గత ఏడాది డిసెంబర్ 31వ తారీకు చిన్నపాటి వీడియో చేసి పవిత్రకి నరేష్ లిప్ కిస్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో నరేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ వయసులో ఆ రకంగా వ్యవహరించడం పట్ల నెగటివ్ కామెంట్లు వచ్చాయి. ఇండస్ట్రీలో కూడా నరేష్ పవిత్రతో “మళ్ళీ పెళ్లి” సినిమాలో స్పెషల్ వీడియోలో వ్యవహరించిన తీరుపై రక రకాల కామెంట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే మరోసారి పవిత్ర నరేష్ మళ్లీ ముద్దులతో రెచ్చిపోయారు. లేటెస్ట్ గా ఒక టీవీ షోకి ముఖ్య అతిథులుగా వెళ్లిన ఈ జంట.. మళ్లీ ముద్దులతో రెచ్చిపోయారు. వినాయక చవితి సందర్భంగా ఓ ప్రముఖ టీవీ షోలో “స్వామి రారా” అనే ఒక ప్రత్యేక షోని ప్రసారం చేస్తూ ఉన్నారు.
ఈ షోపట్ల టాలీవుడ్ లోని పలువురు కమెడియన్స్, సెలబ్రిటీస్ పాల్గొని సందడి చేయడం జరిగింది. ఈ షోలో భాగంగా నరేష్, పవిత్రకి గులాబీ పువ్వు ఇస్తూ ప్రొపోజ్ చేయడం, స్టేజీపైనే నరేష్ కి పవిత్ర ముద్దు ఇవ్వడం వంటివి కనిపిస్తున్నాయి. అలాగే ఒకరిని ఒకరు ఏఏ ముద్దుపేరులతో పిలుచుకుంటారో కూడా ప్రేక్షకులకు తెలియజేశారు. పవిత్రని నరేష్ ‘బేబీ’ అని పిలుస్తాడట. ఇక నరేష్ ని పవిత్ర ‘రాయ’ అని పిలుస్తుందట. ‘నవరసరాయ’ అనేది నరేష్ కి ఉన్న బిరుదు. దానిలో నుంచి రాయ అనే పదాన్ని తీసుకోని పవిత్ర ఆలా పిలుస్తుందట. అయితే మరోసారి టెలివిజన్ షోలలో కూడా ఇద్దరూ ముద్దులు పెట్టుకోవడం పట్ల ఇండస్ట్రీలో.. నెగటివ్ కామెంట్లు వస్తున్నాయట. మొన్న వెండితెరపై ఇప్పుడు బుల్లితెరపై ఆ వయసులో కూడా నరేష్.. ఆ రకంగా వ్యవహరించి సమాజానికి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాడని.. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు చీదరించుకుంటున్నారట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!