NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vyooham: ‘వ్యూహం’ మువీ రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు బ్రేక్

Vyooham: టాలివుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ మువీ రిలీజ్ కు బ్రేక్ పడింది. జనవరి 11వ తేదీ వరకూ విడుదలను నిలుపుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు మద్యంతర ఆదేశాలు ఇచ్చింది. వ్యూహం మువీకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. డిసెంబర్ 29న (శుక్రవారం) వ్యూహం సినిమా విడుదల కావాల్సి ఉంది. లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం ఇరుపక్షాల వాదనలు జరిగాయి.

పిటిషనర్ తరపున న్యాయవాది మురళీధర్ రావు వాదనలు వినిపించారు. వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ అజెండాతో రూపొందించారన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేమ్ చేసే విధంగా సినిమా తీశారన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా చిత్రాన్ని రూపొందించారనీ, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల మీద దీని ప్రభావం పడుతుందన్నారు. ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్ పేరుతో డీ ఫేమ్ కు పాల్పడటం సరికాదనీ, దానికి కూడా ఒక హద్దు ఉంటుందని అన్నారు. ఈ సినిమా ప్రజలపై ప్రభావం చూపించేలా ఉంటుందని పేర్కొన్నారు.

మువీ నిర్మాణ సంస్థ తరపున సీనియర్ కౌన్సిల్, ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సినిమాకి సెన్సార్ బోర్డు ఇచ్చే సర్టిఫికెట్ యే ఫైనల్ అని, వారే ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదని గుర్తు చేసిన నిరంజన్ రెడ్డి..సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇలా పిటిషన్ వేసే అర్హత లేదని చెప్పుకొచ్చారు. అయినా ఒక వ్యక్తిని, పార్టీని కించపరిచేలా సినిమా ఉంటే..సివిల్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేయాలని గాని ఇలా హైకోర్టు లో కాదని పేర్కొన్నారు.

అలాగే వ్యూహం మువీ డాక్యుమెంటరీ కాదనీ, సినిమాగా తెరకెక్కించేటప్పుడు స్వేచ్చ ఉంటుందని, అది కళాకారులకు మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లు అభిప్రాయపడింది. జనవరి 11 వరకు నిలుపుదల చేస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

YSRCP: అధికారికంగా వైసీపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ..ఆ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లే..?

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju