NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

TTD: టీటీడీ ఉద్యోగుల సంక్షేమం, ధార్మిక ప్రచారంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం గురువారం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగింది. టీటీడీ ఉద్యోగులకు భూమన తన చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఇంటి పట్టాలు అందించడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు.

17 సంవత్సరాల క్రితం తాను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయమై చర్చించినట్లు చెప్పారు. తన ఒత్తిడి వల్లే ఉద్యోగులకు ఇంటిస్థలాలు మంజూరు చేసినట్లు 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే వేదిక మీద తెలియజేశారని గుర్తు చేశారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాను సంప్రదించినప్పుడు ఆయన ఉచితంగా ఇంటి స్థలాలు ఇద్దామని చెప్పారన్నారనీ, అయితే చట్ట ప్రకారం ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే నామమాత్రపు ధరతో ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని సాకారం చేయడంలో ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర కార్యనిర్వాహకవర్గం తనకు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించారని పేర్కొంటూ వారికి ఛైర్మన్ అభినందనలు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఉద్యోగులతో తమకున్న బంధాన్ని విడదీయలేరని కరుణాకర రెడ్డి అన్నారు. తాను పేరు కోసం కాకుండా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించానని చెప్పారు.

తాను రాజకీయాల్లో ఉండడం వల్లే ఎమ్మెల్యేగా, ఛైర్మన్ గా అయ్యానని, ఈ పదవులు రావడం వల్లే పేదల కోసం, ఉద్యోగుల కోసం తాను నిస్వార్ధంగా పని చేయగలుగుతున్నట్లు తెలిపారు. ఎన్నో ప్రభుత్వాలు ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయం గురించి చూస్తాం, చేస్తామని చెప్పారు కానీ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ననీ, ఈ విషయాన్ని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని భూమన కోరారు.

YSRCP: కళ్యాణదుర్గం నుండి మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుకొండకు షిప్ట్ .. రీజన్ ఏమిటంటే..?

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju