NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు..కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

TTD: తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజుకు 20వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాల్సి ఉండగా రెండు రోజులుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయలేదు. దీంతో తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాల వద్ద నేడు భక్తుల రద్దీ పెరగడంతో తోపులాట జరిగింది. రెండు రోజుల విరామం తరువాత తిరుమలలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. భక్తుల తాకిడి ఎక్కువకావడంతో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగి ముగ్గురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని రూయా ఆసుపత్రికి తరలించారు.

TTD key decision on break darshan
TTD key decision on break darshan

TTD: భక్తుల ఆగ్రహం

టీటీడీ అధికారుల వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తిరుమల చేరుకుని మూడు నాలుగు రోజులు అయినా టోకెన్లు ఇవ్వడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనం మంచినీళ్లు వంటి సదుపాయాలు లేక చిన్న పిల్లలతో ఇబ్బందులు పడాల్సి వస్తొందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇవ్వకపోయినా కొండపైకి అనుమతి ఇస్తే తలనీలాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకుంటామని పేర్కొంటున్నారు.

టోకెన్లు లేకుండానే అనుమతి

పరిస్థితులు గమనించిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్యూలైన్ లో ఉన్న భక్తులను టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ భక్తుల రద్దీ దృష్టి పెట్టుకుని అయిదు రోజుల పాటు వీఐపీ విరామ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. విరామ (బ్రేక్) దర్శనాల సమయంలోనూ సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు టీడీపీ తెలిపింది. భక్తులు అందరూ సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతానికి సర్వదర్శన టికెన్ల జారీని నిలిపుదల చేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju