NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : రెండేళ్లలో జగన్ కుర్చీ దిగాల్సిందేనా ? మరి ఈయన ఏంటి అలా అన్నాడు ?

YS Jagan : ఏపి APలో గ్రామ పంచాయతీ ఎన్నికల హోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ TDP క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేసే పనిలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు Chandra babu తలమునకలైయ్యారు. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నా ప్రధాన రాజకీయ పక్షాలు వీటినీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక పోతే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏ ముహూర్తాన అన్నారో జమిలి ఎన్నికలు అంటూ అదే చంద్రబాబు పట్టుకుని సీఎం జగన్ ఉండేది ఇంకా ఏడాదో రెండేళ్లో ఉంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. మొదటి దశ ఎన్నికల నామినేషన్ల పర్వంలో వైసీపీపై వీరోచితంగా పోరాడి నామినేషన్లు దాఖలు చేశారు. అదే స్పూర్తితో రెండవ దశలోనూ పార్టీ శ్రేణులు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ నేతలకు సూచనలు చేశారు.

YS Jagan : TDP chandrababu చంద్రబాబు comments on jagan govt
YS Jagan TDP chandrababu చంద్రబాబు comments on jagan govt

గ్రామాలు బాగుపడాలంటే టీడీపీ మద్దతు దారులు గెలవాలన్నారు. వైసీపీ మద్దతుదారులు గెలిస్తే ఊళ్లనే మింగేస్తారని అన్నారు. గ్రామాల్లో రౌడీ పాలన అంతానికి ఇదే తొలి మెట్టు అని పేర్కొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంలో జగన్మోహనరెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయిన తరువాత ఊరికో బకాసురుడు తయారు అయ్యారని ఈ ఎన్నికల్లో వారికి బుద్ది చెప్పాలన్నారు. పార్టీ సానుభూతిపరులకు, నాయకులకు నామినేషన్ ల పర్వంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే టీడీపీ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలన్నారు.

ఎటువంటి సంఘటనలు జరిగినా తగిన సాక్షాధారాలతో కలెక్టర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇంకా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉండేది ఏడాదో రెండేళ్లు మాత్రమే, సర్పంచ్ లు అయిదేళ్లు అధికారంలో ఉంటారనీ చెప్పుకొచ్చారు చంద్రబాబు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేననీ, పాత బిల్లు బకాయిలు అన్నీ వడ్డీతో సహా చెల్లించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఒక్కో గ్రామానికి అభివృద్ధికి అయిదు కోట్ల వరకూ నిధులు వస్తాయనీ, వైసీపీ వాళ్లు గెలిస్తే అయిదు కోట్ల వాళ్లే స్వాహా చేస్తారని చంద్రబాబు విమర్శించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju