YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నోటీసులు అందుకున్న ఎంపి అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ అధికారుల ముందు హజరైయ్యారు. అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో సీబీఐ కార్యాలయానికి ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులుతో పాటు భారీగా అనుచరులు చేరుకున్నారు. దీంతో సీబీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కోటిలోని సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మధ్యాహ్నం మూడు గంటలకు అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి రాగా, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. తొలి సారిగా సీబీఐ విచారణను అవినాష్ రెడ్డి ఎదుర్కొంటున్నారు.

అయితే అవినాష్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని సీబీఐ అధికారులు తోసి పుచ్చి షాక్ ఇచ్చినట్లు తెలుస్తొంది. విచారణ పారదర్శకంగా ఉండేందుకు విచారణ ప్రక్రియను వీడియో తీయించాలని, తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని అవినాష్ రెడ్డి ముందుగా సీబీఐ అధికారులకు లేఖ రాశారు. కానీ అవినాష్ తరపు న్యాయవాదిని విచారణ గదిలోకి సీబీఐ అనుమతించలేదని సమాచారం. సాధారణంగా ఇటువంటి కేసుల్లో కోర్టు ఆదేశాలు ఉంటే మాత్రం దర్యాప్తు అధికారులు విచారణ సందర్భంలో న్యాయవాదిని అనుమతిస్తారు. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి 41 ఏ నోటీసులపై కోర్టును ఆశ్రయించి అటువంటి ఆదేశాలు పొందలేదు. దీంతో న్యాయవాదిని విచారణ గదిలోకి సీబీఐ అధికారులు అనుమతించలేదని తెలుస్తొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి కాల్ డేటా సేకరించిన సీబీఐ అధికారులు దాని ద్వారా ఘటన జరిగిన రోజు ఎవరెవరితో మాట్లాడారు. ఘటనా స్థలంలో ఆధారాలు చెరిపేసిన వ్యవహారం, వివేకా గుండె పోటుతో మృతి చెందాడని ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చారు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తో ఉన్న సంబంధాలు తదితర విషయాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.

వివేకా హత్య కేసుకు సంబంధించి దాదాపు మూడేళ్లుగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2019 మార్చిలో వివేకా హత్య జరిగినప్పటి నుండి దాదాపు ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు విచారణ ను ప్రారంబించింది. ఇప్పటి వరకూ 248 మందిని ఫ్రశ్నించి వారి నుండి వాంగ్మూలాలను సీబీఐ అధికారులు సేకరించారు. ఇంత మందిని ప్రశ్నించినప్పటికీ ఈ కేసులో మొదటి నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని మాత్రం ఇప్పటి వరకూ సీబీఐ ప్రశ్నించలేదు. దర్యాప్తులో పురోగతి లేదనీ, అసలైన దోషులను సీబీఐ తేల్చడం లేదంటూ ఆరోపణలు రావడం, వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సైతం రెండు మూడు పర్యాయాలు సీబీఐ ఉన్నతాధికారులను కలిసి ఈ కేసు విషయంపై మాట్లాడటంతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలతో వివేకా కేసు తెలంగాణకు బదిలీ అవ్వడంతో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు.
కుప్పకూలిన మూడు ఫైటర్ జెట్ విమానాలు ..సురక్షితంగా బయటపడిన ఇద్దరు పైలట్లు..ఒకరు మిస్సింగ్