Cabinet Viral News: వణుకుతున్న ఆ ఇద్దరు మంత్రులు..! కొత్తగా ఈ ముగ్గురికి మంత్రి పదవి ఖరారు..!?

Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?
Share

Cabinet Viral News: ఓ మంత్రిని గెంటేశారు.. ముగ్గురు మంత్రులపై సైలెంట్ గా ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించారు.. కొందరు మంత్రులు అపాయింట్మెంట్ కోరినా దొరకడం లేదు. కేటీఆర్, కేసీఆర్ ఫోన్ లకు కూడా అందుబాటులో ఉండడం లేదు.. మరోవైపు సీఎం కార్యాలయం నుండి కొత్తగా ముగ్గురు నాయకులకు ఫోన్లు చేసి అందుబాటులో ఉండాలని చెప్తున్నారు.. ఈ మొత్తం వ్యవహారాలు చూస్తుంటే తెలంగాణాలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో పెద్ద స్థాయిలో ప్రక్షాళన జరగనున్నట్టు తెలుస్తుంది..!

ఈటెల రాజేందర్ వ్యవహారంతో తెలంగాణాలో టీఆరెస్ లో అంతర వివాదాలు రగులుతున్నాయి.. పార్టీతో పాటూ ప్రభుత్వంలో కూడా వివాదాలు రచ్చకెక్కుతున్నాయి..! ఈటెలకి పడిన దెబ్బ ఆయన ఒక్కడితోనే ఆగుతుందా..? ఇంకా ఎవరినయినా తరిమేస్తారా..!? అనే చర్చ మొదలయింది. ఇద్దరు మంత్రులకు దాదాపు పీకెయ్యడం ఖరారైనట్టు సమాచారం కూడా అందింది. దీంతో ఆ ఇద్దరూ తమ తరపున ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. మరో వైపు రానున్న రెండు, మూడు రోజుల్లో తెలంగాణ మంత్రి వర్గంలో మూడు కొత్త ముఖాలు వచ్చి చేరనున్నట్టు ప్రచారంలో ఉంది. ఉన్నవారిలో పోయేది ఎవరు..? ఎందుకు..!? కొత్తగా వచ్చేది ఎవరు..? అనే లెక్క ఓ సారి చూద్దాం…

Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?
Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?

Cabinet Viral News: ఈటెల తరహానే ఈ ఇద్దరికీ..!!

మంత్రివర్గంలో తరిమేసే జాబితాలో మొదట వినిపిస్తున్న పేరు చామకూర మల్లారెడ్డి. కార్మిక శాఖ మంత్రి. ఆ మంత్రివర్గంలో అత్యంత అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రి ఈయన. వందలాది ఎకరాలు కబ్జా చేశారని.. మేడ్చల్, కొంపల్లి ప్రాంతాల్లో పేదల భూములను తక్కువ ధరకు కొనేసి.. అసైన్మెంట్ భూములు దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఏడాది నుండి ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ ఇటీవల కొన్ని ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. దీంతో మల్లారెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆ అవినీతి కంపు ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ కి కూడా అంటడంతో ఇతన్ని బయటకు పంపించేయడమే మంచిదని చిన్న సారూ.., పెద్ద సారూ భావిసున్నారట.

Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?
Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?

* ఈ విషయం తెలిసి.. తన పదవి పోవడం ఖాయమని తెలిసి మల్లారెడ్డి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు సార్లుని (కేసీఆర్, కేటీఆర్) కలిసి నచ్చచెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. నిన్న సాయంత్రం నుండి ఈయనకు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు..!

* మరో మంత్రి గంగుల కమలాకర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈయనపై కొన్ని ఆరోపణలున్నాయి. అయిదు నెలల కిందటే గంగుల కమలాకర్ పై ఓ మహిళతో ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడారన్న సంభాషణలు టీఆరెస్ అనుకూల ఛానెల్ లో ప్రసారమయ్యాయి. అప్పుడే ఇతనికి మూడింది అనుకున్నారు. కాకపోతే ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇతన్ని అప్పుడు పీకలేదు. కానీ తాజాగా కూర్పు అవసరమవ్వడంతో ఇతని పదవిపై కూడా కత్తి వేలాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న కమలాకర్ నిన్నటి నుండి వణుకుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ లను కలవాలని, మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు..!

Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?
Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?

కొత్తగా ఈ ముగ్గురు..!?

ఇక ఇప్పటికే ఈటెల పదవి ఖాలీ అయింది. ఇక మల్లారెడ్డి.., కమలాకర్లను కూడా గెంటేసి అవకాశం ఉంది. వీరితో పాటూ ప్రశాంత్ రెడ్డి లేదా శ్రీనివాసగౌడ్ లలో ఒకరికి మంత్రి పదవి గండం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మూడు లేదా నాలుగు ఖాళీలు ఉన్నాయి.. అందుకే కొత్తగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, సండ్ర వెంకట వీరయ్యలకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురుకీ ఇప్పటికే సీఎం ఆఫీస్ నుండి సమాచారం అందింది. కవిత కూడా తన సన్నిహితులతో ఈ విషయాన్నీ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో తెలంగాణ మంత్రివర్గం విషయంలో కేసీఆర్ కొన్ని దూకుడైన నిర్ణయాలతో తన మార్క్ చూపించారు. అయితే దీని ప్రభావం రాజకీయంగా ఎదుర్కొనేందుకు కూడా ఆయన సిద్ధంగానే ఉండాల్సి ఉంటుంది..!!


Share

Related posts

బాబు “బుగ్గ”న మంత్రి గారి లెక్కల చుక్క..! 

arun kanna

‘వారి ఆటలు ఇక సాగవు’

somaraju sharma

Vijayawada : కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్ వాడీ ఆయా మృతి..?

somaraju sharma