Great Indian Family: విసిరేసిన లాటరీ టికెట్ కి రూ. 7. కోట్లు..! అమెరికాలో మెరిసిన భారతీయత – ఇంటరెస్టింగ్ స్టోరీ

Great Indian Family: Lottery Ticket Mystery Story
Share

Great Indian Family: అనగనగా ఓ మహిళ.. ఓ లాటరీ టికెట్ కునుగోలు చేసింది. లాటరీ ఫలితాలు చూస్తూ తన టికెట్ ని స్క్రాచ్ చేసింది. లాటరీ తగలలేదని నిరాశతో.., కోపంతో ఆ టికెట్ ని విసిరి పడేసింది.. ఈమె చూడడంలో లోపమో.. సరిగా స్క్రాచ్ చేయాలేదో.. పాపం, ఆ టికెట్ కి. రూ. 7. కోట్లు లాటరీ తగిలింది..! ఇంకేం ఉంది, ఆ టికెట్ లేక, లాటరీ నగదు రాక డబ్బు పోగొట్టుకుని తాను చేసుకున్న పనికి కుమిలిపోతుంది..!
కానీ ఆమెకు ఒక భారతీయ కుటుంబం నుండి ఊహించని మంచితనం ఎదురయింది. ఈ ఘటనతో అమెరికా మొత్తం ఆ భారతీయ కుటుంబం గొప్పతనం చెప్పుకుంటుంది.. ఇది ఒక కథలా ఉన్నప్పటికీ ఇది నిజమే. అమెరికాలో జరిగింది. ఆ దురదృష్టవంతురాలు అమెరికా మహిళా కాగా.. ఆ లాటరీ దుకాణం భారతీయులది కావడం విశేషం..

Read it: మార్కెట్ లోకి వచ్చేసిన కొత్త కరోనా మెడిసిన్  

Great Indian Family: Lottery Ticket Mystery Story
Great Indian Family: Lottery Ticket Mystery Story (Indian Family)

Great Indian Family: అసలు ఏం జరిగిందంటే..!?

అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రంలోని సౌత్ వీక్ పట్టణంలో ఓ భారతీయ కుటుంబం లాటరీ దుకాణం నిర్వహిస్తుంది. లక్కీ స్టాప్ పేరిట కొన్నేళ్లుగా ఈ దుకాణం నిర్వహిస్తున్నారు. స్థానికంగా నివసించే రోజ్ ఫి అనే మహిళా ఇక్కడకు తరచూ వస్తూ లాటరీ టికెట్ కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో రోజ్ ఫి ఓ టికెట్ కొనుగోలు చేసారు. “డైమండ్ మిళియన్స్ స్క్రాచ్ ఆఫ్” అనే విభాగంలో టికెట్ కొన్నది ఆమె. ఇటీవల ఈ లాటరీ ఫలితాలు వచ్చాయి. ఆ మహిళ ఏదో ఆలోచిస్తూ.. పరధ్యానంలో ఉంటూ టికెట్ స్క్రాచ్ చేసింది.నంబర్ సరిగా చూడకుండానే విసిరేసింది. పూర్తిగా స్క్రాచ్ కూడా చేయలేదు. ఈ టికెట్ విషయంలో మరో ట్విస్టు కూడా ఉంది.. ఈ పాడేసుకున్న టికెట్ ఓ భారతీయ యువకుడికి దొరికింది..

Great Indian Family: 7.3 Crores Lottery ticket Mystery Story
Great Indian Family: 7.3 Crores Lottery ticket Mystery Story (Rose Feigh)

చెత్తబుట్టలో టికెట్.. కానీ..!

భారతీయ సంతతికి చెందిన యువకుడు అభిశా ఆ చెత్తబుట్టలో లాటరీ టికెట్ ఉండడం గమనించి.. సరదాగా దాన్ని ఓపెన్ చేసి చూసారు. ఫలితాలను చెక్ చేస్తే రూ. 7.3 కోట్లు లాటరీ వచ్చినట్టు తెలుసుకుని ఎగిరి గంతులేసాడు. వెంటనే ఈ విషయాన్నీ తన కుటుంబానికి చెప్పి.. ఆ అందరూ ఎగిరి గంతులేశారు. ఆ డబ్బుతో ఏం చేయాలో ప్రణాళికలు కూడా వేసుకున్నారు. కానీ ఇండియాలో ఉండే తన వాళ్ళతో చెప్పుకోవాలని ఇండియాలో ఉండే తన నాయనమ్మ, తాతయ్య, బంధువులకు చెప్పాడు. అయితే అభి నాయనమ్మ, తాతయ్య దానికి అంగీకరించలేదు. ఆ టికెట్ ఎవరిదో వాళ్ళకే ఇచ్చేయాలని సూచించారు. దీంతో రోజ్ ఫి ని వెతికి పట్టుకుని టికెట్ అప్పగించారు. దీంతో రోజ్ ఫి ఆనందానికి అవధులు లేవు. ఆ కుటుంబాన్ని, అభిని పట్టుకుని ఏడ్చేసింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి, వాళ్ళను ఆప్యాయంగా చూసుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇటు అభి కుటుంబం, అటు రోజ్ ఫి కూడా మీడియాతో మాట్లాడుతూ జరిగిన వ్యవహారం మొత్తం చెప్పారు.. నిజంగా ఇంత మంచి భారతీయ కుటుంబం అమెరికాలో కోట్లు వదులుకుని దేశానికి కూడా మంచి పేరు తెచ్చిందని స్వదేశంలో ప్రశంసలు వస్తున్నాయి..


Share

Related posts

Prabhas: ప్రభాస్ పై వస్తున్న వార్తల విషయంలో క్లారిటీ ఇచ్చిన హాలీవుడ్ డైరెక్టర్..!!

sekhar

ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టేది ఇక్కడి నుండే…!

arun kanna

అలాంటి కళను బయటకు తీసిన ఇస్మార్ట్ భామ!

Teja